newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

కారుణ్య మరణానికి రాజధాని రైతులు రాష్ట్రపతికి దరఖాస్తు..

01-01-202001-01-2020 19:30:11 IST
Updated On 02-01-2020 15:27:12 ISTUpdated On 02-01-20202020-01-01T14:00:11.297Z01-01-2020 2020-01-01T13:59:58.267Z - 2020-01-02T09:57:12.625Z - 02-01-2020

కారుణ్య మరణానికి రాజధాని రైతులు రాష్ట్రపతికి దరఖాస్తు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితిలు అందరికీ తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వం విశ్వనగరంగా నిర్మించాలని తలపెట్టిన అమరావతిని ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలు చేయనున్నామని ప్రకటించారు. అందుకు ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు.. కులాల ముద్ర వేయడం కూడా జరిగిపోయింది.

సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంలో అభివృద్ధి వికేంద్రీకరణ లేదని కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమేనని మేధావులు తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తుండగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మాత్రం ఆందోళనతో పోరాడుతున్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనకు మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా రోజు రోజుకీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వం ఆందోళనను అణచివేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే రైతులకు భూములు అభివృద్ధి చేసి ఇస్తామని మంత్రులు ప్రకటిస్తుండగా వేలసంఖ్యలో పోలీసులను దించి ఆందోళనలు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం రాజధానిపై పట్టువదలకుండా పోరాడుతున్నారు. ఇంకా పోరాటాన్ని ఉదృతం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

కాగా, రాజధాని రైతులు తాజాగా ఉమ్మడి కారుణ్య మరణానికి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో రైతులు రాజధాని తరలింపుతో తమ భవిష్యత్ అంధకారంగా మారుతుందని.. ఇక తమకి చావే దిక్కని పేర్కొన్నారు. సీఎం జగన్ స్వలాభం కోసమే రాజధాని తరలింపు కుట్ర చేస్తున్నారని.. రెండు వారాలుగా నిరసనలు తెలుపుతున్నా తమ గోడు వినే దిక్కు లేదని తెలిపారు.

అధికార పార్టీ నేతలు తమ నిరసనలను కూడా అవహేళన చేసేలా పెయిడ్ ఆర్టిస్టులు అని స్టేట్మెంట్లు ఇస్తున్నారని.. రైతులపై భౌతిక దాడులకు కూడా దిగుతున్నారని పేర్కొన్నారు. మాకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే కులం పేరుతో రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై కక్ష్య కట్టిందని పేర్కొన్నారు. మా పిల్లల భవిష్యత్ అంధకారంగా మారిపోతుంటే చూసి భరించలేకపోతున్నామన్నారు.

జీవచ్ఛవంలా ఇలా బ్రతికి ఉండడం కన్నా చావే మేలని నిర్ణయించుకున్నామని.. దయచేసి తమకి కారుణ్య కారణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని లేఖలో కోరారు. ఈ లేఖ ఇప్పడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కేంద్రం రాజధాని తరలింపుపై సానుకూలంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తుండగా రాష్ట్రపతి ఈ లేఖపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle