newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

కాపు నేత‌లు మెత్త‌బ‌డ‌టం లేదే..!

08-09-201908-09-2019 09:03:32 IST
2019-09-08T03:33:32.298Z08-09-2019 2019-09-08T03:32:56.270Z - - 14-11-2019

కాపు నేత‌లు మెత్త‌బ‌డ‌టం లేదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత క్ర‌మంగా తేరుకుంటున్న తెలుగుదేశం పార్టీకి నేత‌ల వ‌ల‌స‌లు వ‌రుస షాక్‌లు ఇస్తున్నాయి. చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితులు, న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులతో మొద‌లైన వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి.

ఓ నేత‌ను పిలిచి బుజ్జ‌గించే లోపు మ‌రో నేత చేజారిపోతుండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు చంద్ర‌బాబుకు త‌ల‌పోటుగా మారింది. ముఖ్యంగా కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు తెలుగుదేశం పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఐదేళ్లు ప్ర‌భుత్వంలో ఉండ‌గా, ప్ర‌త్యేకించి ఎన్నిక‌ల వేళ త‌మ‌కు పార్టీ అధిష్టానం అన్యాయం చేసింద‌నేది ఆ పార్టీలోని కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌ల భావ‌న‌. గ‌త ఎన్నికల్లో త‌మ సామాజిక‌వ‌ర్గం త‌మ వైపు ఉన్నందునే టీడీపీ గెలిచింద‌ని, ఈ ఎన్నిక‌ల్లో త‌మ వ‌ర్గం త‌మ‌కు దూరం కావ‌డానికి పార్టీ వైఖ‌రే కార‌ణం అనే నిర్ణ‌యానికి వారు వ‌చ్చారు. అందుకే త‌ర‌చూ అసంతృప్తి బావుటా ఎగ‌రేస్తున్నారు.

కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటింది. కాపులు ఎక్కువ‌గా ఆ పార్టీకి ఓటు వేయ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని టీడీపీలోని కాపు నేత‌లు భావిస్తున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు కాపుల ప‌ట్ల చంద్ర‌బాబు అవ‌లంభించిన వైఖ‌రి, కాపు నేత ముద్ర‌గ‌డ‌పై తీవ్ర ఆంక్ష‌లు పెట్ట‌డం వంటి ప‌రిణామాలు కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వారు భావిస్తున్నారు.

ఇక‌, పార్టీలోనూ త‌మ‌కు పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల ముందు పార్టీ ఫండ్ విష‌యంలోనూ ఓ సామాజ‌క‌వ‌ర్గంతో పోల్చుకుంటే త‌మ‌కు అన్యాయం చేశార‌ని వారు భావిస్తున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోకుండా ఒకే సామాజ‌క‌వ‌ర్గం నేత‌ల‌కు పెద్ద పీట వేశార‌ని అనుకుంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు నేత‌లు రెండుమూడు సార్లు భేటీ అయి ఈ విష‌యాల‌ను చ‌ర్చించారు.

దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు వారిని పిలిపించుకొని మాట్లాడారు. దీంతో కొంద‌రు ఆయ‌న బుజ్జ‌గింపులకు మెత్త‌బ‌డ‌గా మ‌రికొంద‌రు మాత్రం అదే వైఖ‌రితో ఉన్నారు. దీంతో ఒకొక్క‌రు చొప్పున పార్టీని వీడుతున్నారు.

అన్నం స‌తీష్ అయితే ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌విని సైతం వ‌దులుకొని బీజేపీలో చేరిపోయారు. ఇక‌, తోట త్రిమూర్తులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దారులు వెతుకుతున్నారంట‌. ఇప్ప‌టికే ఆయ‌న వైసీపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.

అందుకే జిల్లాలో జ‌రిగిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. పార్టీ పెద్ద‌ల‌కు సైతం ఆయ‌న అందుబాటులోకి రావ‌డం లేదు. క్యాడ‌ర్ కూడా ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిన వ‌రుపుల రాజా సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీ గూటికి చేరే అవ‌కాశం ఉంది. ఇక‌, బెజ‌వాడ నేత బోండా ఉమ‌ను బుజ్జ‌గించ‌డంతో కొంత వెన‌క్కు త‌గ్గినా ఆయ‌న పార్టీలో అంత యాక్టీవ్‌గా ఉండటం లేదు.

మ‌రో నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా తెలుగుదేశంలోని కాపు సామాజ‌క‌వ‌ర్గం నేత‌లు చాలామంది టీడీపీని వీడేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తోట త్రిమూర్తులుతో పాటు మరికొంద‌రు నేత‌లు టీడీపీని వీడే అవ‌కాశం ఉంది. మ‌రి, చంద్ర‌బాబు వారికి ఎలా న‌చ్చ‌జెపుతారో చూడాలి.

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle