newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కాకినాడ కలిసొస్తుందా?

12-03-201912-03-2019 12:52:41 IST
2019-03-12T07:22:41.167Z12-03-2019 2019-03-12T07:15:35.871Z - - 18-07-2019

కాకినాడ కలిసొస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాకినాడ తీరంలో రాజకీయాలు వేడెక్కాయి.  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడినుంచే తన ఎన్నికల నగారా మోగించారు .కాకినాడలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో డప్పు మోగించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచార సభలో సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు జగన్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ మార్పు కోసం పాటు పడాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

రైతులు, డ్వాక్ర మహిళలు, చేనేతలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు అందరినీ మోసం చేశాడని, కొత్తగా హామీలు ఇస్తూ మరో ఐదేళ్ళు మోసం చేయడానికి సిద్ధపడ్డారని జగన్ మండిపడ్డారు.  అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. అందరూ కోరుకునే రాజన్న రాజ్యం కోసం అందరూ కోరుకుంటున్నారని తప్పకుండా రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. టీడీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్‌ చేసిన ప్రసంగం పార్టీ కేడర్‌కు ఇతోధిక స్ఫూర్తిని కలిగించిందంటున్నారు. 

రానున్న నెలరోజులు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్తా బూత్‌స్థాయి నుంచి  పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక జరిగిన తొలి సభ కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు తరలి రావడంతో సభాప్రాంగణం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఈసారి ఎలాగైనా గోదావరి జిల్లాల్లో పాగా వేయాలని జగన్ ఉవ్విళ్ళూరుతున్నారు.

2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఈసారి సగానికి పైగా స్థానాలు సాధించాలని, తూర్పుగోదావరిలో 10 స్థానాలు గెలవాలని వైసీపీ భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగిరితే అమరావతి తమదే అనే భావన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. మొత్తం వైసీపీ ఆవిర్భావం వేళ జగన్ కాకినాడలో మోగించిన నగారా పార్టీ భవిష్యత్తుకి దిక్సూచి అవుతుందని ఆ పార్టీనేతలు అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle