newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

కాంగ్రెస్ కు బాబు విడాకులు.. ప్రస్తుతమా.. శాశ్వతమా?

03-10-201903-10-2019 11:46:41 IST
2019-10-03T06:16:41.994Z03-10-2019 2019-10-03T06:16:39.481Z - - 16-11-2019

కాంగ్రెస్ కు బాబు విడాకులు.. ప్రస్తుతమా.. శాశ్వతమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి విడాకులు ఇచ్చేశారా? గడిచిన ఎన్నికలలో జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ తో జతకట్టి మహా గడ్ బంధన్ అంటూ మోడీఫై కాలు దువ్విన బాబు ఎన్నికల అనంతరం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మరోపక్క తెలంగాణలో మహాకూటమి కట్టి కారును ఢీ కొట్టి చిత్తై పోయారు. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ కు దూరమైపోయారు. త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఎన్నికలకు టీడీపీ ఒంటరిగానే సైకిల్ సవారీ చేస్తుంది. అయితే ఇది శాశ్వతమా.. ప్రస్తుతమా అన్న అనుమానాలొస్తున్నాయి.

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తొలిసారి బెజవాడలో బీజేపీతో కూడా పనిలేని ప్రతిపక్షాలను ఏకం చేసి కూటమికట్టి తర్వాత బీజేపీ మద్దతివ్వడంతో వీపీ సింగ్ ప్రభుత్వమొచ్చింది. ఇక అనంతర చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ మద్దతుతో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలను తెచ్చారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు కుదిరితే బీజేపీతో కలిసి వెళ్లారు.. లేదంటే బీజేపీకి దూరంగా వెళ్లారు. కానీ కాంగ్రెస్ కు మాత్రం దగ్గర కాలేదు. కానీ అనూహ్యంగా గడిచిన 2019 ఎన్నికల సమయంలో సాక్షాత్తు చంద్రబాబే ఏఐసీసీ అధుక్షుడు రాహుల్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపి.. అక్కడ నుండి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని ఏకం చేసే బాధ్యతను భుజానేసుకున్నారు.

ముందుగా తెలంగాణలో తానొక్కరే కాంగ్రెస్ తో వెళ్లకుండా మహాకూటమి కట్టి కారును ఢీకొట్టారు. అయితే గులాబీ దళపతి సెంటిమెంట్ ముందు ఏ కూటములు పనిచేయలేదు. దీంతో ఏపీలో పొత్తుల ఊసే చేయలేదు. మరి తెలంగాణలో పెట్టుకున్నారు కదా అంటే అది తెలంగాణ నేతల ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చారు. కానీ కేంద్రంలో మాత్రం రాహుల్ తో కలిసి బీజేపీని టార్గెట్ చేశారు. అంతకుముందు ఎన్నికలకు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తే గడిచిన ఎన్నికలకు ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీని కార్నర్ చేసి నిత్యం విమర్శలతోనే కాలం గడిపారు. ఇక్కడా అక్కడా అని లేకుండా రాష్ట్రానికో మిత్రుడిని చేసుకొని దేశమంతా తిరిగి మోడీని గుజరాత్ పంపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కూడా కోరారు.

కానీ ఫలితం అక్కడా సూన్యమే. మోడీ కింగ్ మేకర్ అని ప్రూవ్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మోడీ మహాశక్తిగా కనిపిస్తున్నారు. దీంతో బాబు చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందు రోజూ కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఎక్కడా ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇక్కడనుండి రాజకీయం కొత్త సమీకరణాల వైపు వెళ్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో పాటు తెలంగాణ-జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం ఏపీలో కూడా ప్రతికూల ప్రభావం చూపిందనే అంచనాకు వచ్చేశారు.

అన్నిటినీ బేరీజు వేసుకొనే చంద్రబాబు నష్టాలను త్వరగా పూడ్చుకునే క్రమంలో ముందుగా కాంగ్రెస్ కు దూరమైనట్లుగా కనిపిస్తుంది. ఇందుకు హుజూర్ నగర్ అందివచ్చిన అవకాశంగా భావించారో ఏమో ఒక్క కాంగ్రెస్ తోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా యుద్దానికి సిద్ధమయ్యారు. నిజానికి ఒక్క స్థానమే కనుక పొత్తులతోనే వెళతారనుకున్నారు. అందుకే ఉత్తమ్ లాంటి వాళ్ళు సంప్రదింపులలో కాస్త ఆలస్యమయ్యారు. కానీ ఒంటరిగానే పోటీకి దిగి తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అనే వాళ్లకు సమాధానంగా సత్తా చాటాలనుకుంటున్నారు.

మొత్తానికి హుజూర్ నగర్ ఎన్నికలతో కాంగ్రెస్ కు టీడీపీ దూరం అనే సంకేతాలిచ్చారు. మరి ఇది ఈ ఉపఎన్నికల వరకే ఉంటుందా? మరోసారి మైత్రి అవుతుందా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలంటూ ఎన్నికలకు ముందు చెలరేగి మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీపై ఒక్క విమర్శ చేయడంలేదు. మరోపక్క టీడీపీకి ఆర్ధిక వెన్నుదన్నుగా పేరున్న నేతలు ఆ బీజేపీలోకి మారిపోయారు. మరి ఇది దేనికి సంకేతాలనే అనుమానాలు కూడా రాజకీయాలలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి బాబుగారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి?.. అయినా మన పిచ్చి కాకపోతే రాజకీయమంటేనే ఏదీ శాశ్వతం కాదు.. అన్నీ ప్రస్తుతాలే కదా!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle