newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కళ లేని పండగ.. కరోన నామ సంవత్సర ఉగాది!

25-03-202025-03-2020 13:56:23 IST
Updated On 25-03-2020 13:57:06 ISTUpdated On 25-03-20202020-03-25T08:26:23.170Z25-03-2020 2020-03-25T08:26:21.034Z - 2020-03-25T08:27:06.042Z - 25-03-2020

కళ లేని పండగ.. కరోన నామ సంవత్సర ఉగాది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగువారికి అతిపెద్ద పండుగులలో ఒకటైన ఉగాది ఈఏడాది కళతప్పింది. తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఈ ఏడాది ఉగాది ధీనంగా గడచిపోతుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు దేవుడికి ఒక దణ్ణం.. వీలైతే ఉగాది పచ్చడి చేసి తలాకొంచెం రుచి చూడడమే ఈ ఏడాది ఉగాది పండగ. అంతకు మించి ముందుకెళ్తే పెనుప్రమాదం అనే హెచ్చరికలు ఉండనే ఉన్నాయి.

ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించేస్తుంది. రోజురోజుకు దాని భారిన పడే వారి సంఖ్యా పెరుగుతుండగా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీని బారిన పడకుండా తమని తాము రక్షించుకునే క్రమంలో ఎవరికి వారు స్వీయ నిర్బంధం స్వీకరించాల్సి వచ్చింది. దీంతో పండగ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఇక తెలుగు పండగకి సొంత ఊళ్ళకి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది.

మరోవైపు.. ఆదివారం కేంద్రం జనతా కర్ఫ్యూ సూచిస్తే.. అదే రోజు అర్ధరాత్రి నుండి రెండు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించేశాయి. దీంతో పండగకి ఇంటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, నగరాలలో హాస్టళ్లలో ఉంటూ ఇబ్బందులు పడే వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉండిపోయారు. లాక్ డౌన్ కఠినతరం చేయడంతో తప్పక ఎక్కడి వాళ్ళు అక్కడే ఫిక్స్ అయిపోయారు.

ఇక ఉగాది వస్తుందంటే పూలు, పండ్లు, కూరగాయలు ఇలా మార్కెట్స్ అన్నీ కళకళలాడుతుండేవి. కానీ ఈసారి మాత్రం కూరగాయల మార్కెట్స్ లో పండగ హడావుడి తగ్గి కరోనా హడావుడి కనిపిస్తుంది. కరోనా సాకుతో ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో ప్రజలు పండగ దేవుడెరుగు ముందు జీవనమే పోరాటంగా భావిస్తూ.. ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

మరోవైపు ఉగాది లాంటి అచ్చ తెలుగు పండగ... అది కూడా ముఖ్యమైన పండగ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో హడావుడి ఉంటుంది. తక్కువలో తక్కువగా మూడు నాలుగు సినిమాలైనా విడుదలకు వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ చేసి కరోనా వ్యాప్తి కట్టడిలో సినిమా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు.

మరోవైపు.. అచ్చమైన తెలుగు పండగగా భావించే ఉగాది కనుక మన తెలుగు భాష, సంప్రదాయాలు, సంస్కృతి గొప్పతనాలను చెప్పేలా సాంస్కృతిక సంఘాలు, బాషా పండితులు, అవధానులుతో భారీ కార్యక్రమాలను నిర్వహించి వాటి ఔన్నత్యాన్ని భావితరాలకు అందించేలా రూపకల్పన చేసేవారు. కరోనా పుణ్యమా అని అలాంటి వాటికి అవకాశం లేకుండా పోయింది.

ఏవో కొద్దీ టీవీ చానెళ్లు మాత్రం అలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ కొంతలో కొంత ప్రజలకు పండగను గుర్తు చేస్తున్నాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్టాలలో ప్రజలు తమకి ఉగాదులు లేవు.. ఉషస్సులు లేవు అని ఉసూరుమంటూనే మొండి మహమ్మారిని తరిమికొట్టేందుకే మా త్యాగమంటూ శ్రీ శార్వరి నామ సంవత్సరాన్ని కాస్త కరోన నామ సంవత్సరంగా మార్చుకొని ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle