newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

‘కళా’ కేవలం డిజిటల్ సంతకాలకేనా?

24-02-201924-02-2019 06:11:58 IST
2019-02-24T00:41:58.602Z23-02-2019 2019-02-23T16:26:55.770Z - - 29-05-2020

‘కళా’ కేవలం డిజిటల్ సంతకాలకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగు దేశంలో కొత్త సంస్కృతి మొదలయ్యిందా? అయినట్టే కనపడుతోంది. 

అయితే ఈ కొత్త సంస్కృతికి రెండు కోణాలున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మామూలుగా తెలుగుదేశం లో టిక్కెట్ల నిర్ణయాలు చివరి నిమిషం వరకూ తేలవు. చివరి వరకూ తేల్చకుండా నామినేషన్ కి గడువు ముగియడానికి ఒకరోజు ముందు అర్ధరాత్రి దాటిన తరువాత జాబితా విడుదల చెయ్యడం చంద్రబాబు పాలసీ అని తెలుగుదేశం పార్టీ లో సీనియర్లు ఛలోక్తిగా అంటూ ఉంటారు. చివరి వరకూ సర్వేలనీ, ఇంటెలిజెన్స్ రిపోర్టులనీ టిక్కెట్లు ఆశించేవారిని చూరుకి వేలాడదీయడం చంద్రబాబుకు అలవాటని పార్టీలో మొదటి నుండీ ఒక బలమైన అభిప్రాయం పాతుకుపోయింది. 

సర్వేల మాట ఎలా ఉన్నా, టిక్కెట్లు రానివారు అల్లరి చేయకుండా, నియోజకవర్గాలలో పార్టీకి డామేజీ చెయ్యకుండా కూడా ఈ ఉపాయం వాడతారు చంద్రబాబు అని ఒక అభిప్రాయం. ఈ రెండూ కాదు, అసలు చటుక్కున నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు వల్ల కాదు, అతనిది మొదటి నుంచీ నాన్పుడు ధోరణే అని తిరుపతిలో చదువుకునే రోజుల్నుంచీ ఆయనను తెలిసిన వాళ్ళు చెప్పే మాట.  

అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. కడప, రాజంపేట లోక్ సభ నియోజకవర్గాల పరిధి లో మెజారిటీ అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులను నిర్ణయించేసారు ముఖ్యమంత్రి గారు. ప్రముఖ పత్రికల్లో లీకులు కూడా అధికారికంగా ఇచ్చేసారు. ఇది మామూలు విషయం కాదు, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి. 

అయితే అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోఇలా జరుగుతుందా, ఇలా చంద్రబాబు చేయగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చేయగలిగితేమాత్రం ఆశావహులు కొంత స్థిమిత పడదానికీ, ఎంపికైన అభ్యర్ధులు తీరుబడిగా తమ తమ ప్రచార సన్నాహాలు చేసుకోడానికీ వీలవుతుంది. 

ఇది కేవలం ఒక కోణం మాత్రమే. 

కానీ జరుగుతున్న పరిణామాలలో మరో కోణం కూడా ఉంది. 

పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలలో పాల్గొంటున్న వారు ఈ విషయం గురించే చెవులు కొరుక్కుంటున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగే ఈ సమీక్షా సమావేశాలలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారి జాడ ఎక్కడా లేకపోవడం సమావేశాలలో పాల్గొన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, విద్యుత్ మంత్రి కళా వెంకట్రావును ఈ సమావేశాలకు దూరంగా ఉంచారు. 

అసలే తెలుగుదేశంలో పార్టీ పదవులు నామమాత్రం అని అందరకీ తెలిసినప్పటికీ, మరీ ఇంత బహిరంగంగా సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుణ్ణే గుమ్మంలోకి రానీయకుండా ఈ సమీక్షలు జరపడం ఏమిటనే ప్రశ్నలు అమరావతిలో గుసగుసగా వినపడుతున్నాయి. ఎవరేం చెప్పినా చివరికి అన్ని నిర్ణయాలూ తండ్రీ కొడుకులే తీసుకున్నా, కనీసం ఇదివరలో చంద్రబాబు ఫార్మాలిటీలు పాటించేవారనీ, ఈ మధ్య కనీసం అవికూడా మృగ్యమయ్యాయనీ రాజధానిలో ఇప్పుడు తాజాగా వినపడుతున్న మాట. 

కళా అలంకరించిన అధ్యక్ష పదవి కేవలం పార్టీ నాలెడ్జి సెంటర్ రాసి విడుదల చేసే పత్రికా ప్రకటనలకు, బహిరంగ లేఖలకూ తన డిజిటల్ సంతకాన్ని అతికించడానికే చంద్రబాబు వాడుతున్నారని కొంతమంది సీనియర్లు జోకులు వేసుకుంటున్నారు. ముద్రగడ మీద, పవన్ కళ్యాణ్ మీదా, చివరికి అమిత్ షా మీదా విమర్శలు గుప్పిస్తూ పార్టీ బ్యాక్ ఆఫీసులో తయారయ్యే ప్రకటనలలో తప్ప కళా వెంకట్రావు పేరు, ఊసూ మరో చోట వినపడకపోవడం ఈ జోకులకు మూలకారణం. 

ఉత్సవ విగ్రహానికి పూజలు లేకపోయినా, కనీసం ఊరేగింపులోనైనా చోటు ఉండాలిగా!     

 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   7 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   7 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   11 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   12 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   14 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   15 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   15 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   16 hours ago


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle