newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కల వరించింది.. రైల్వే జోన్ కూతపెట్టింది

28-02-201928-02-2019 08:03:34 IST
2019-02-28T02:33:34.958Z28-02-2019 2019-02-28T02:31:18.324Z - - 18-07-2019

కల వరించింది.. రైల్వే జోన్ కూతపెట్టింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్దాల తెలుగు ప్రజల రైల్వే జోన్ కల సాకారమైంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ ఏర్పాటైంది. ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ ని ప్రకటించామని చెప్పారు. 

విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేసినట్టు చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని, భాగస్వాములు అందరితో చర్చించామని, ఈ దిశగా అధికారిక చర్యలు చేపడతామన్నారు. 

చాలాకాలం నుంచి విశాఖ రైల్వేజోన్ పై విస్తృతంగా అధ్యయనం చేశామని, వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజిస్తామని, ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్ గా మారుస్తున్నామని, ఈ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్ లో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయని గోయల్ పేర్కొన్నారు.

మరోవైపు విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. 2014 నుంచి విభజన హామీల కోసం పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఎన్నికలముందు ఆఖరి క్షణంలో రైల్వేజోన్ ప్రకటించారని, మిగిలిన విభజన చట్టంలోని హామీలు కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది విశాఖ ప్రజల విజయమని, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle