newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

కలామ్ పేరు మార్పు రివర్స్.. అధికారులపై జగన్ ఆగ్రహం

06-11-201906-11-2019 11:05:31 IST
Updated On 06-11-2019 15:27:15 ISTUpdated On 06-11-20192019-11-06T05:35:31.046Z06-11-2019 2019-11-06T05:35:16.292Z - 2019-11-06T09:57:15.854Z - 06-11-2019

కలామ్ పేరు మార్పు రివర్స్..  అధికారులపై జగన్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించే ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరును ఉన్నపళంగా వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చి అభాసుపాలైన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటల్లోనే రివర్స్ అయిపోయింది. పేరు మార్చిన పథకానికి తిరిగి కలామ్ పేరునే జోడించి ప్రభుత్వం మమ అనింది కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

ప్రతిభా పురస్కారానికి కలామ్ పేరును తీసివేసి వైకాపా ప్రభుత్వం వైఎస్కార్ ప్రతిభా పురస్కారంగా మార్చడాన్ని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో గంటలోపే రచ్చరచ్చ చేసిపడేసింది. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు సమాచారం తెలుపకుండా అలాంటి ఆదేశాన్ని జారీ చేసినందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులపై విరుచుకపడ్డారు. 

మాజీ భారత రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ పేరును నాకు ఏమాత్రం తెలుపకుండా ప్రతిభా పురస్కారం అవార్డు నుంచి ఎలా తొలగిస్తారంటూ జగన్ అధికారులపై మండిపడ్డారు. వెనువెంటనే ఆ జీవోను రద్దు చేసి ప్రతిభా పురస్కారం అవార్డుకు కలామ్ పేరునే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి విజయకుమార్ ప్రతిభా పురస్కార అవార్డుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చేరుస్తూ జీవో నెంబర్ 78ని జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలకు ముఖమంత్రి తండ్రి వైఎస్సార్ పేరును తగిలిస్తున్న అలవాటులో భాగంగా పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వెనుకా ముందూ ఆలోచించకుండా కలామ్ పేరుకు బదులు వైఎస్సార్ పేరు తగిలించేశారు.

దాంతో మంగళ వారం ఉదయం నుంచి టీడీపీ సోషల్ మీడియా బృందాలు ఈ వార్తను విపరీతంగా వ్యాప్తిలోకి తేవడమే కాకుండా #YSRCPInsultsAbdulKalam హాష్ ట్యాగ్ పెట్టి మరీ వ్యతిరేకప్రచారం చేశాయి. తెలుగుదేశం పార్టీతోపాటు అనేకమంది నెటిజన్లు, కలామ్ అభిమానులు కూడా ఆయన పేరును ప్రతిభా పురస్కారం అవార్డును తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

పాలకులు తాము చేసిన మంచిపనుల బట్టి ప్రజల మన్నన, గుర్తింపు పొందుతారు కానీ ప్రతిపథకానికీ దివంగత నేతల పేర్లు తగిలించి ఆనందపడితే, ప్రభుత్వ విభాగాలు దాన్నొక వేలంవెర్రిలా పాటిస్తే ఇలాగే జరుగుతుంది మరి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle