newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

28-02-202028-02-2020 07:52:12 IST
2020-02-28T02:22:12.626Z28-02-2020 2020-02-28T02:21:57.555Z - - 05-04-2020

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఈమధ్యకాలంలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల మునిసిపల్ శాఖలో అవినీతిపై కొరడా ఝులిపించిన ఆయన కన్ను ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులపై పడింది. ఏరియా ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యపరికరాలు, అందుబాటులోని సేవలను ఏసీబీ అధికారులు తనిఖీల్లో కనుగొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది. వైద్య పరికరాలు, మందులు కొనుగోలు  వినియోగం తదితర అంశాలపై ఆరా తీసింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ తాజాగా ఏరియా హాస్పిటల్స్ లో తనిఖీలు చేపట్టింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వైద్య శాలలపై తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ లో ఏసీబీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  ఎసిబి ఏ ఎస్ పి  శ్రీనివాసులు డిఎస్పి అల్లా బక్షి సర్కిల్ ఇన్ స్పెక్టర్ గిరిధర్,  నాగేంద్ర తో పాటు పది మంది పోలీసుల బృందం ఏరియా హాస్పిటల్ లో తనిఖీలు చేపట్టారు. 

హాస్పిటల్ అవసరాలకు  కొనుగోలు చేసిన వివిధ వైద్య పరికరాలు మరియు మందులు కొనుగోలు హాస్పిటల్లో డెవలప్ మెంట్ ఫండ్  కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో సహా అన్ని అంశాలను ఏసీబీ అధికారుల బృందం పరిశీలన చేపట్టారు. బృందం పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

మందుల కొనుగోలులో చేతివాటం ప్రదర్శించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. డాక్టర్ల గైర్హాజరు, ఆలస్యంగా రావడం వంటివి అధికారులు గుర్తించారు. రిజిస్టర్‌ మెయిన్‌టెన్స్‌తో పాటు ఓపీ, ఐపీ పేషంట్స్‌ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులలో జరిగిన మోసాల నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఏపీలోని 13 జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో మందుల కొనుగోలుపై ఫోకస్ పెట్టారు. ప్రైవేట్ క్లినిక్‌లను ఏర్పాటు చేసుకున్న వైద్యులు చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు గైర్హాజరు అవుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ లను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి.

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   13 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   14 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   15 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   16 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   17 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   20 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle