newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

కర్నూలు కల సాకారమైందా?

01-01-201901-01-2019 17:01:58 IST
2019-01-01T11:31:58.264Z01-01-2019 2019-01-01T11:31:56.119Z - - 29-05-2020

కర్నూలు కల సాకారమైందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లంటే గన్నవరం (విజయవాడ), విశాఖపట్నం, మధురపూడి (రాజమండ్రి), రేణిగుంట (తిరుపతి) త్వరలో రాయలసీమలో మరో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు సాగించనుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం నూతన సంవత్సరం వేళ కొత్తచరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇవాళ ట్రయల్ రన్ విజయవంతం అయిందని అధికారులు ప్రకటించారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టెర్మినల్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) భవనాల నిర్మాణాలు పూర్తికావస్తున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 8న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుమతులూ తీసుకున్న తరువాత ఏప్రిల్‌, మే నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం విమానాలు నడవనున్నాయి. 

 ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు 2014 ఆగస్టు 15న కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి రాజధానికి దూరంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు ఇక్కడే నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావాలంటే రవాణా సౌకర్యం మెరుగుపడాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కర్నూలు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన చిగురించింది. ఓర్వకల్లు సమీపంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 999.50 ఎకరాలను ప్రభుత్వం ‘ఏపీ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ’కి కేటాయించింది.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాలకు రూ.90.5 కోట్లు మంజూరు చేసింది.  2017 జూన్‌లో పనులను చేపట్టారు. రన్‌వే చుట్టూ 9.4 కి.మీ. ప్రహరీ, 5.3 కి.మీ. పెరిఫెరల్‌ రోడ్డు, ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు వీలుగా 1.7 కి.మీ. పొడవుతో మరో 4 రోడ్లు, కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌ చేరుకోవడానికి 2.4 కి.మీ. అప్రోచ్‌ రోడ్‌ నిర్మించారు. రోడ్డు పొడవునా మొక్కలు నాటారు. ఏటీసీ భవనం పూర్తవుతోంది. ఎలక్ర్టికల్‌ సబ్‌ స్టేషన్‌  నిర్మించారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 80-85 మంది ప్రయాణించే ఏటీఆర్‌-760 విమానాలు 4 ఒకేసారి పార్కింగ్‌ చేసుకోవచ్చు. కర్నూ లు విమానాశ్రయం నుంచి గన్నవరం, హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయలకు డొమెస్టిక్‌ విమానాలు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. 

 హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం నుంచి సెస్నా సైటేషన్‌ సీజే-2 టర్బో జెట్‌ విమానంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కర్నూలు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ అధికారులు, సాంకేతిక సిబ్బందితో కలిసి రన్‌వే, ఆప్రాన్‌, ప్యాసింజర్‌ టెర్మినల్‌ పనులను పరిశీలించారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుతో పాటు రూ.350 కోట్లతో నెల్లూరులో, 100 కోట్లతో కుప్పంలో రూ.100 కోట్లతో డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు ఏర్పాటుకానున్నాయి కర్నూలు నగరానికి 20 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయానికి మొదట్లో ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుగా అనేవారు. ఆ తరువాత కర్నూలు విమానాశ్రయంగా మార్చారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం మీద ఏపీ చరిత్రలో ఇవాళ రెండు కీలక ఘట్టాలు ప్రారంభం అయ్యాయి. విజయవాడలో ఏపీ హైకోర్టు, కర్నూలులో ఎయిర్‌పోర్ట్ ట్రయల్ రన్. ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింతగా ప్రగతి సాధిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   4 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   5 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   9 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   10 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   11 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   12 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   12 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   13 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   13 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle