newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

06-04-202006-04-2020 14:55:08 IST
Updated On 06-04-2020 14:59:07 ISTUpdated On 06-04-20202020-04-06T09:25:08.136Z06-04-2020 2020-04-06T09:25:02.007Z - 2020-04-06T09:29:07.569Z - 06-04-2020

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇందు గలదు అందు లేదని వలదు.. కాదేదీ వివాదానికి అనర్హం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది నెలలు గడిస్తే ఈ ప్రభుత్వం తెచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. గత వివాదాలు.. వాటి కారణాలను కాసేపు పక్కనేబెడితే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న వివాదం కరోనా సాయంపై క్రెడిట్. మాదంటే మాదంటూ.. ఇప్పుడు ఇక్కడ జరిగిపోతున్న ప్రచారానిది.

కరోనా మహమ్మారి ప్రజలపై నిలువునా కమ్మేసింది. కరోనా సంగతెలా ఉన్నా దాని నివారణకు ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ దెబ్బకు పేద, బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు జీవనం అస్తవ్యస్తమైంది. దీని నుండి వారికి కొంత ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వాలు రేషన్ సరుకులతో పాటు కొద్దిపాటి నగదును కూడా సాయంగా అందిస్తున్నాయి.

అయితే, ఈ సాయం రాష్ట్ర ప్రభుత్వానిదని ఓ వర్గం.. కాదు కేంద్ర ప్రభుత్వానిదని మరికొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాదనలకు దిగుతున్నారు. నిజానికి కేంద్రం తన వద్ద విపత్కర పరిస్థితులలో వినియోగించుకునేందుకు ఉండే విపత్తు నిధులను రాష్ట్రాలకు భారీగా విడుదల చేసింది. అయితే.. దీని కోసమే ఖర్చు పెట్టాలి అన్న నిబంధన మాత్రం విధించలేదు.

అందుకే కొన్ని రాష్ట్రాలు ఒక్కో కుటుంబానికి రెండు వేలు కూడా చెల్లిస్తే పొరుగున ఉన్న తెలంగాణ కూడా 1500 చెల్లించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అతి తక్కువగా వెయ్యి రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ఇక కరోనా కారణంగా పంపిణీ చేసిన రేషన్ కూడా ఈ నిధిలోనిదే. అందులో కూడా ఏపీ ఒక్కటే అతి తక్కువగా ప్రజలకు ఇచ్చిన ఘనత సొంతం చేసుకుంది.

ఇక కేంద్రం విడుదల చేసిన విపత్తు నిధులు రాష్ట్రాల నుండి వెళ్ళిందే. అంటే రాష్ట్ర ప్రజలే వివిధ రకాలుగా ప్రభుత్వాలకు చెల్లించిన పన్నుల నుండి అత్యవసర పరిస్థితులలో వినియోగించుకునేందుకు బడ్జెట్లో కొంత నిధిని కేటాయిస్తారు. ఆ నిధులే ఇప్పుడు తిరిగి రాష్ట్రాలకు చేరింది. అంటే ఇది అటు కేంద్రానిదో.. రాష్ట్రానిదో కాదు.. రాష్ట్రాల నుండి కేంద్రం వద్దకు వెళ్లిన డబ్బు తిరిగి రాష్ట్రాలకు ఎలా వచ్చిందో.. ప్రజల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లిన డబ్బు మళ్ళీ తిరిగి అలానే ప్రజలకు చేరుతుంది.

ఇక, వివాదం విషయానికి వస్తే.. ఏపీని మించి నగదు ఇస్తున్న కేరళ, తమిళనాడులో కానీ పొరుగున తెలంగాణలో కానీ ఈ నగదుపై ఎక్కడా వివాదం కాలేదు. మరి ఒక్క ఏపీలోనే వివాదాంగా ఎందుకు మారింది. దీనికి కారణం అధికార పార్టీ నీచపు బుద్దేనని విశ్లేషకులు ఘాటుగా విమర్శలకు దిగుతున్నారు. అధికార వైసీపీ ఈ సాయం నగదును కూడా ఎన్నికల ప్రచారంగా వాడుకోవడంతోనే వివాదంగా మారిందని అర్ధమవుతుంది.

ఈ నగదు సాయం, రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకే ఇస్తున్నారు. అంటే వీరంతా దారిద్రరేఖకు దిగువన ఉన్నవారిని అర్ధం. ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్న నేటి పరిస్థితులలో మానవీయ కోణాన్ని వీడి అధికార పార్టీ విచ్చలవిడిగా ఎన్నికల ప్రచారానికి తెరదించడమే ప్రస్తుతం రాష్ట్రంలో రచ్చగా మారింది. కొన్ని చోట్ల అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య దాడులు, ప్రతి దాడులకు కూడా కారణమైంది.

ఒకపక్క ప్రధాని నరేంద్ర మోడీ జాతి ఐక్యతా రాగం పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపట్టి మూకుమ్మడిగా కరోనాను తరిమేయాలని పిలుపునిస్తుంటే ఏపీలో మాత్రం ఏదైనా రాజకీయం చేస్తాం.. అందులోనే ప్రజలను నాశనం చేస్తామన్నట్లు అధికార పార్టీ పోతున్న వింత పోకడలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిపై చర్చకు వెళ్లే ఆష్కారమే లేకుండా ఎప్పటికప్పుడు పొలిటికల్ పకోడీలను వండి వార్చే ప్రభుత్వం ఇది కూడా మరో బుల్లెట్ గా భావించిందేమో!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle