newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనాతో సహజీవనం.. ఏపీ ప్రజల అభద్రతా భావం..!

28-04-202028-04-2020 14:33:08 IST
Updated On 28-04-2020 15:01:32 ISTUpdated On 28-04-20202020-04-28T09:03:08.155Z28-04-2020 2020-04-28T09:03:05.376Z - 2020-04-28T09:31:32.021Z - 28-04-2020

కరోనాతో సహజీవనం.. ఏపీ ప్రజల అభద్రతా భావం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కరోనాను కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంటే ఏపీ సీఎం మాత్రం కట్టడి చేయలేమని చేతులెత్తేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కరోనా వైరస్ కూడా మన జీవనం విధానంలో ఒకటిగా అలవాటు చేసుకోవాలని.. అది అంటువ్యాధిలాగా.. మహమ్మారిలాగా చూడాల్సిన అవసరం లేదని కూడా సీఎం స్పష్టంచేయడంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.

కేంద్రం ఒకపక్క లాక్ డౌన్ అమలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. లాక్ డౌన్ వలనే భారత్\లో భయానక పరిస్థితుల నుండి తప్పించుకోగలిగారని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతుండగా సీఎం జగన్ మాత్రం ఎన్ని చేసినా కరోనా వదిలే పరిస్థితిలేదని.. భవిష్యత్ లో కలిసి జీవించడమే మార్గంగా కనిపిస్తుందని చెప్పడంతో ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలు సీఎం జగన్ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నాయి.

కాగా.. సీఎం జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలలో అభద్రతా భావం కలుగుతుందని విశ్లేషకుల మాట. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కరోనా అంతం చేసే పరిస్థితి లేదని.. కలిసి కలిసి బ్రతకాల్సిందేనని ప్రకటించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. కరోనా కూడా చికెన్ ఫాక్స్, జ్వరం లాంటిదేనని మందులు వాడి నయం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన ఏకైక సీఎం కూడా ఈయనే.

అయితే, సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుండే కాకుండా అటు ప్రజలలో కూడా వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏపీలో కరోనా కట్టడి చేయలేకపోతే కేరళ రాష్టంలో ఎలా అయింది? పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కఠినంగా ఉండైనా ఎందుకు ప్రయత్నిస్తుంది? లాక్ డౌన్ పాటిస్తున్న ప్రపంచదేశాలన్నీ పనిలేక చేస్తున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక సీఎం తాజాగా వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు అభద్రతా భావంలోకి వెళ్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య సెంచరీ దిశగా సాగుతుంది. మంగళవారం కూడా 82 కేసులు నమోదైనట్లుగా ప్రకటించడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1259కి చేరింది. ఒకపక్క పెరుగుతున్న కేసులు.. కట్టడి చేసే పరిస్థితి లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజలలో సహజంగానే ఆందోళన కలిగిస్తుంది.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వస్తే కరోనాను ఎదుర్కోగలమనే భరోసా ప్రజలలో నింపుతారు. కఠినంగా ఉంటామని చెప్తూనే ఆందోళన పనిలేదు.. ఎదిరించి తీరుదామని ధైర్యాన్ని ప్రజలకు నూరిపోస్తారు. అదే సగం ప్రజలకు మానసిక బలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అయన వ్యాఖ్యలపై ప్రజలలో చర్చే ఆందోళన కరంగా మారుతుంది.

తొలి నుండి కరోనా అంటే తేలిక భావనే ఉందని ఆరోపణలు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంతం. తొలినాళ్ళలో అటు కేసీఆర్, ఇటు జగన్ పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ పరిస్థితిని అర్ధం చేసుకొని తన వాక్ చాతుర్యంతో కరోనాను సీరియస్ అంశంగా మలచుకుంటే.. సీఎం జగన్ మాత్రం రాను రాను కరోనా తనకు నాన్ సీరియస్ అంశంగానే కనిపిస్తుందని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

అయితే.. మరోపక్క మిగతా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు సీఎం జగన్మోహన్ రెడ్డి కఠినంగా అమలుచేస్తున్నారని ఇప్పటికీ చెప్పడం విశేషం కాగా.. మోపిదేవి వెంకటరమణ లాంటి కొందరు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కూడా స్లీపర్ సెల్స్ ద్వారా ప్రతిపక్షాల కుట్ర అంటూ చేసిన వ్యాఖ్యలతో ఇదెక్కడి రాజకీయ దౌర్భాగ్యంరా భగవంతుడా అంటూ ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle