newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

14-10-201914-10-2019 16:21:57 IST
2019-10-14T10:51:57.278Z14-10-2019 2019-10-14T10:51:54.178Z - - 14-11-2019

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలకు కాకే కారణం.. మీరు వెటకారంగా నవ్వినా ఇదే నిజం. మేము నిజమే చెబుతున్నాం కనుక మీరు కూడా నమ్మి తీరాల్సిందే. అచ్చం ఇవే మాటలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ గారి నోటి నుండి వచ్చాయి. ఇంతకీ కాకి వలన కరెంట్ కోత ఎక్కడంటే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం వద్ద. తాజాగా విశాఖలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశమై పార్టీకి సంబంధించిన అంశాలు, ప్రస్తుత ప్రభుత్వ పాలన, కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలు తదితర అంశాలపై చర్చించారు.

అయితే ఆ సమావేశం సమయం జరుగుతున్న సమయంలో రెండు సార్లు కరెంట్ పోయింది. ఆ సమావేశానికి మీడియా లైవ్ కవరేజ్ కూడా ఇస్తుండడంతో కరెంటు పోయినప్పుడల్లా అంతా చీకటిగా మారిపోయింది. కరెంట్ వస్తూ పోతూ ఉండడంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి కూడా అలానే ఉందని.. ఎప్పుడు వెలుతురు ఉంటుందో.. ఎప్పుడు అంధకారంగా మారిపోతుందో ఎవరూ చెప్పలేరని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విద్యుత్ అధికారులను విచారణకు ఆదేశించింది. దీనికి అధికారులు కూడా ఓ నివేదికను ఇచ్చారు. అయితే నిజంగానే కాకి వలనే కరెంట్ పోయిందో లేక ఓ కథను అల్లి ప్రభుత్వానికి పంపించారో కానీ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో ఓ కాకి కరెంట్ తీగల మీద వాలడంతో కరెంట్ పోయిందని.. అలా కాకి పదే పదే చేయడం వలన ఆ ప్రాంతంలో పదే పదే సరఫరాకు అంతరాయం కలిగిందని నివేదికలో పేర్కొన్నారు.

ఇక మన మంత్రిగారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అదే కాకి కథ చెప్పేశారు. చంద్రబాబు మీద మాకేమీ పగలేదని.. వ్యక్తిగతంగా కరెంట్ నిలిపివేయలేదని కాకి ఆ పరిసర ప్రాంతాలలో తీగల మీద వాలడంతో అంతరాయం కలిగిందన్నారు. దీంతో అవాక్కవడం మీడియా ప్రతినిధుల వంతైంది. కొందరు మీడియా ప్రతినిధులు నవ్వలేక బిగబట్టుకొని మరీ నవ్వేస్తే దానికి మంత్రిగారు మీరు నవ్వుకున్నా ఇదే నిజం. కనుక మీరు నమ్మి తీరాల్సిందేనని చెప్పడం కొసమెరుపు.

అయితే అసలు మంత్రి అవంతి గారు ఇంత వివరంగా వివరణ ఎందుకిచ్చారంటే.. ఏపీలో విద్యుత్ కోతలు గత కొంత కాలంగా అనధికారంగా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్సేంజ్ లో కొనాలని ప్రభుత్వం అనుకుంటున్నా అమ్మెందుకు కంపెనీలు సిద్ధంగా లేకుండాపోయాయి. ఇప్పటికే యూనిట్ రూ12 లెక్కన కొంత మేర కొనుగోలు చేస్తున్నా ఇప్పుడున్న సంక్షోభంలో అది ఎందుకూ సరిపోవడం లేదు. దీంతో కరెంట్ కోతలు తప్పడం లేదు.

మునిసిపాలిటీలు, నగరాలు, పల్లెలు కేటగిరీ వారీగా రెండు నుండి మూడు గంటలు కోతలు విధిస్తున్నారు. గృహ విద్యుత్ కనెక్షన్ కు అనుబంధంగా ఉన్న మొబైల్ నంబర్ కు కోతల గురించి మరేవో కారణాలతో సమాచారం పంపిస్తున్నారు కానీ అధికారిక కోతగా చెప్పడం లేదు. ప్రతిపక్షాలు, ప్రజలు కరెంట్ కోతలు అని గోల చేస్తున్నా ప్రభుత్వం, మంత్రులు కోతలే లేవంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు వేదిక వద్ద కూడా కరెంట్ కోతల వలన పోలేదని కాకి వలనే కోత వచ్చిందని చెప్పడం కోసమే మంత్రి అవంతిగారు ఇంత విడమర్చి చెప్పారు. అదీ విషయం!

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle