newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

కరణానికి చిక్కులు తప్పవా?

14-09-201914-09-2019 10:39:10 IST
2019-09-14T05:09:10.532Z14-09-2019 2019-09-14T05:08:59.418Z - - 09-12-2019

కరణానికి చిక్కులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేతలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. చీరాల నుంచి కరణం బలరామ్‌ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ ఎన్నికల పిటిషన్‌ పై హైకోర్టు స్పందించింది.

కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్‌ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా కరణం బలరాం ఇచ్చిన అఫిడవిట్ సరిగా లేదని ఆమంచి ఆరోపిస్తున్నారు. కరణం బలరామ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని,దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదన్నారు ఆమంచి.

ఎన్నికల నిబంధనల ప్రకారం బలరామ్‌ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టుని కోరారు. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్‌లో ప్రస్తావించలేదని తెలిపారు. 

కరణం బలరాం గత 40ఏళ్ళుగా రాజకీయాల్లో వున్నారు. 2014 ఎన్నికల్లో ఆమంచి చీరాల నుంచి ఇండిపెండెంట్ గా గెలిచి తర్వాత టీడీపీ లో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీలో చేరారు. టీడీపీ తరఫున కరణం బలరాం పోటీచేశారు. ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం 17,801 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీసినా కరణం బలరాం తన ఇమేజ్ తో ఈ సీటు సాధించారు. తాజా కేసు నేపథ్యంలో కరణం బలరాం ఎలా బయటపడతారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle