newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

కరకట్ట నిర్మాణాలు..కేరళ అక్రమకట్టడాలూ ఒకటేనా?

01-10-201901-10-2019 12:25:57 IST
2019-10-01T06:55:57.740Z01-10-2019 2019-10-01T06:55:55.478Z - - 06-12-2019

కరకట్ట నిర్మాణాలు..కేరళ అక్రమకట్టడాలూ ఒకటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను కూల్చివేయాల్సిందే. అందులో సందేహం లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ప్రభుత్వ శాఖలే అనుమితి ఇస్తే.. ఆ నిర్మాణాలు అక్రమ కట్టడాలు ఎలా అవుతాయి. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పన్నులు కడుతూ ఉన్న సందర్భాలలో ఎవరిని శిక్షించాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు రుసుములు వసూలు చేసి క్రమబద్ధీకరించేసిన ప్రభుత్వ నిర్ణయాలను ఎలా సమర్ధించాలి? తాజాగా దేశ సర్వోన్నత న్యాయ స్థానం కేరళ రాష్ట్రంలోని మరాడు పట్టణంలోని అక్రమ కట్టడాలకు సంబంధించి ఇచ్చిన తీర్పు ఈ ప్రశ్నలకు తావిచ్చింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, అధికారులు, రియల్టర్లు ఇలా అందరి ప్రమేయం ఉంది. ఉంటుంది కూడా.

కేరళ విషయాన్నే తీసుకుంటే కోచి జిల్లాలోని మరాడులో నది బ్యాక్ వాటర్ ప్రవాహాన్ని నియంత్రించేలా బహుళ అంతస్తుల భవనం నిర్మితమైంది. దానిని కూల్చేయాల్సిందిగా సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఆ  తీర్ప బహుదా ప్రశంసనీయం. నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడం ఎంతైనా గర్హనీయం. అటువంటి కట్టడాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదు.

ఈ తీర్పు దరిమలా ఏపీలోని కరకట్టపై వెలసిన కట్టడాల కూల్చివేత విషయంలో సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సబబే అన్న నిర్ధారణకు రావడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే అక్కడ నివాసం ఉంటున్నది ఆషామాషీ వ్యక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు ఉన్న వ్యక్తి. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.

నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించిన కట్టడమైతే ఆయన అందులో ఎందుకు నివాసం ఉంటారు. ఆ నిర్మాణానికి అన్ని అనుమతులూ ఉన్నాయని ఆ భవన యజమాని చెబుతున్నారు. కూల్చివేత నోటీసుపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. అలాగే ఇప్పటికే కూల్చివేతకు గురైన ప్రజా వేదిక గురించి. ప్రజావేదిక భవనాన్ని నిర్మించింది సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్ల పాటు అక్కడ ప్రజా దర్బార్ లు జరిగాయి. ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలను ఆ ప్రజావేదిక నుంచే నిర్వహించారు. అటువంటి ప్రజా వేదికను అక్రమ కట్టడమంటూ కూల్చివేయడం అనుమానాలకు తావిచ్చింది.

కరకట్టపై ఈ రెండు మాత్రమే కాదు ఒక ప్రకృతి చికిత్సాలయం కూడా సంవత్సరాల తరబడి సాగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కరకట్ట మార్గం రహదారిగా కూడా ఉంది.  అక్రమకట్టడాలకు ఇంతని పెనాల్టీ (జరిమానా లేదా  రుసుము) కట్టించుకుని వాటిని క్రమబద్ధీకరించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి యోచన చేయకుండా ఏకాఎకిన కూల్చివేతే పరిష్కారం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే అనుమానాలకు తావిస్తున్నది. అది కూడా సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేయడమే ధ్యేయంగా జగన్ సర్కార్ వేస్తున్న అడుగులు కక్ష సాధింపు ధోరణిలో ఉన్నాయన్న భావన ఏర్పడేందుకు ఆస్కారం కలుగుతోంది.

ఇప్పుడు కేరళలో అక్రమ కట్టడాన్ని కూల్చివేలాయంటూ సుప్రీం కోర్టు ఆదేశాన్ని పట్టుకుని ఏపీ సర్కార్ కు నైతిక మద్దతు లభించిందని భావించడం సరికాదు. హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించేసి కట్టిన ఎన్నో కట్టడాలను అక్కడి సర్కార్ ఫైన్ వేసి క్రమబద్ధీకరించేసింది. కరకట్టపై కట్టడాలకు అటువంటి వెసులు బాటు ఇవ్వడానికి వీలౌతుందా అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది.

నేటికీ హైదరాబాద్ నగరం చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది. ఓ మోస్తరు వర్షానికే నగరం అల్లాడిపోతుంది. ఇందుకు కారణం నాలాల మీద అక్రమ కట్టడాలే అన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటినీ కూల్చేస్తారా? అలా కూల్చేస్తే నగరంలో లక్షల మంది నిరాశ్రయులౌతారన్నది నిజం కాదా? ముంపు నివారణకు అక్కడి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. ఏపీ సర్కార్ కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.  

అయితే ఏపీ సర్కర్ అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇప్పటికే దాదాపు 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. అక్రమ కట్టడాల విషయంలో అత్యంత కఠినంగా ఉంటామన్న సంకేతాన్ని ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటున్నది. కానీ ఒక ప్రభుత్వ హయాంలో అధికారికంగా నిర్మించిన భవనం అక్రమ కట్టడమెలా అవుతుంది? ఒక ప్రభుత్వం చేసిన పని మరో ప్రభుత్వం రాగానే తప్పైపోతే...ఇక శాశ్వత చర్యలకు తావెక్కడుంది.

ప్రతిష్ట కోసం పాకులాడుతూ కూల్చివేతల విషయంలో ముందుకు వెళ్లడం కంటే...పట్టువిడుపులు ప్రదర్శించి సంయమనంతో వ్యవహరించడం అవసరం.  లేదా...కరకట్టపై కట్టడాలు సక్రమం కాదని రుజువులతో సహా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీర్పు కోసం వేచి చూడాలి. అలా కాకుండా ఎవరి మాటా వినననే తత్వంతో ముందుకు వెళ్లడం ప్రభుత్వ ప్రతిష్టకు వన్నె తెస్తుందని భావించలేం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle