newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

కరకట్ట ఇల్లు ఖాళీ చేస్తే బాబుకు 200 గజాల ఇల్లు.. లక్ష్మీస్ కామెంట్

29-09-201929-09-2019 10:27:47 IST
2019-09-29T04:57:47.360Z29-09-2019 2019-09-29T04:57:44.625Z - - 14-11-2019

కరకట్ట ఇల్లు ఖాళీ చేస్తే బాబుకు 200 గజాల ఇల్లు..  లక్ష్మీస్ కామెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవన సహచరి లక్ష్మీ పార్వతి కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించడంలో చిన్న పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తన జీవితపర్యంతం టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవాలని పోరాడిన లక్ష్మీ పార్వతి ఇటీవల బాబు పార్టీ ఘోర పరాజయంతో చివరికి సంతృప్తి చెందినట్లే కనిపిస్తున్నారు. 

ఇప్పుడామె అధికార పార్టీ నాయకురాలిగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో సమర్థిస్తూ వస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక అంశాలపై చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన డిమాండ్ ఏమిటంటే.. వెంటనే చంద్రబాబు కరకట్ట మీద ఉంటున్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయమనే.  

''చంద్రబాబు అత్తగా ఆయన కోసం విరాళాలు సేకరించి 200 గజాల స్థలంలో మంచి ఇల్లు కట్టిస్తాను. కానీ ముందుగా ఆయన ఉండవల్లి లోని కష్ణానది కరకట్ట పక్కన ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా ఆయన కరకట్టమీది అక్రమ నివాసాన్ని కూల్చివేయడటంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి."

ఇదీ లక్ష్మీపార్వతి చంద్రబాబుకు ఇచ్చిన ఆఫర్. కరకట్టమీద రాజభవనం లాంటి లింగమనేని భవంతిని ఖాళీ చేస్తే చంద్రబాబుకు 200 గజాల స్థలంలో మంచి ఇల్లు కట్టిస్తానని లక్ష్మీ పార్వతి చెప్పడం కంటే మించిన జోక్ మరొకటి ఉండదు.  అయితే చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని ప్రసాద్ తన ఇల్లు కూల్చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం, విషయం కోర్టు విచారణలో ఉండిపోవడం జరిగింది. కోర్టు తుది తీర్పు ఇచ్చేదాకా తదుపరి చర్యలు చేపట్టబోనని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందనుకోండి.

అయినా ప్రతివారూ తగుదునమ్మా అంటూ సలహాలు ఇస్తుంటే వాటిని చూసుకుంటూ మౌనం వహిస్తున్న ఖర్మ ప్రస్తుతం చంద్రబాబుకు తగులుకున్నట్లుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో ఉండవచ్చా అంటూ వస్తున్న విమర్శలు రాకముందే వివాదాస్పదమైన ఆ ఇంటిని ఖాళీ చేసి చంద్రబాబు విజయవాడలో మరో ఇంటికి మారిపోయి ఉంటే బాగుండేది కదా అంటున్నారు విమర్శకులు..

కరకట్ట మీద అక్రమనివాసాలు ఉండటం నష్టదాయకం అని హైకోర్టు కూడా తీర్పు చెబితే అప్పుడు చంద్రబాబుకు ఇంకా అవమానకరం కదా.. ఎందుకు కోర్టువరకు వెళ్లిన వ్యవహారంలో బాబు పూర్తిగా మునిగితేలుతున్నారన్నది ఆయన విమర్శకులే కాదు శ్రేయోభిలాషుల నుంచి కూడా వినిపిస్తున్న వ్యాఖ్య.

ఇవన్నీ పక్కనబెడితే.. చంద్రబాబు కరకట్టను వదిలిపెడితే తాను విరాళాలు అడుక్కుని 200 గజాల స్థలంలో ఇల్లు కట్టిస్తానని లక్ష్మీపార్వతి చెప్పడమే ఈ దశాబ్దపు జోక్ కావచ్చు. కాలం తమది కాకపోతే రాజకీయ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు, జోకులకైనా పడిపోవలసిందే కదా మరి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle