newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

కమెడియన్ పృథ్వీకి జగన్ బంపర్ ఆఫర్!

13-07-201913-07-2019 13:39:15 IST
Updated On 13-07-2019 15:58:29 ISTUpdated On 13-07-20192019-07-13T08:09:15.313Z13-07-2019 2019-07-13T08:09:13.441Z - 2019-07-13T10:28:29.014Z - 13-07-2019

కమెడియన్ పృథ్వీకి జగన్ బంపర్ ఆఫర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ డైలాగ్ ఎప్పుడు విన్నా కనిపించేది కమెడియన్ పృథ్వీ. ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుయాయుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ తరఫున ప్రచారం కూడా చేశారు పృథ్వీరాజ్.

చంద్రబాబు, టీడీపీపై ఘాటైన విమర్శలు చేశారు. తాజాగా సీఎం ముఖ్యమంత్రి కావడంతో పృథ్వీకి బంపర్ ఆఫర్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. 

సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ గా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చారని ఫిలిం, మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువరించే అవకాశం ఉంది. ఎస్వీబీసీని పూర్తిగా సంస్కరించనున్నట్టు తెలుస్తోంది. నిరంతరం  వివాదాల్లో నానే ఈ ఛానల్‌ని పృథ్వీ ఎలా దారిలో పెడతారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle