newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

కమెడియన్ ఆలీకి కొమ్ములొచ్చాయా...?

05-04-201905-04-2019 12:55:08 IST
2019-04-05T07:25:08.548Z05-04-2019 2019-04-05T07:24:26.551Z - - 16-12-2019

కమెడియన్ ఆలీకి కొమ్ములొచ్చాయా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్యనే కాదు, సినిమా పరిశ్రమలోనూ వేడిపుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలుగా చీలిపోయిన పరిశ్రమలోని కొందరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తోటి ఆర్టిస్ట్, మహిళ అయిన తనను తెలుగుదేశంలో పార్టీలో ప్యాకేజీ ఆర్టిస్ట్ అని కమెడియన్ ఆలీ చులకనగా మాట్లాడటంపై నటి దివ్యవాణి మండిపడ్డారు. ఒక సినిమాలో నటించినా, వంద సినిమాల్లో నటించినా ఆర్టిస్ట్ అనే అంటారని... పరిశ్రమలో నటులందరూ సమానమేనని, అంతే తప్ప ఆలీ 100 పైగా సినిమాల్లో నటించినంత మాత్రాన కొమ్ములు వచ్చాయా అని ప్రశ్నించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యవాణి వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని గుర్తు చేసిన మీడియా ఆలీని స్పందించాలని కోరగా...దివ్యవాణి పొలిటీషియన్ కాదనీ, ప్యాకేజీ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. బాలనటుడిగా పరిచయమై కిందిస్థాయి నుంచి పైకొచ్చిన నటుడిగా ఆలీ అంటే తనకు గౌరవం ఉందని, దాన్ని నిలబెట్టుకోవాలని దివ్యవాణి సూచించారు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆలీ రెండు గంటల పాటు మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించిన సంగతి ఆలీ అపుడే మర్చిపోయాడేమో అనీ, చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుని ఆలీ హుందాగా మాట్లాడాలి తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని దివ్యవాణి హితవు పలికారు. 

గతంలోనూ టీవీ షోలోనూ, సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ పలువురిని కించపరుస్తూ మాటాడిన ఆలీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అంటే చెల్లింది కానీ రాజకీయాల్లో కి వచ్చాక ఆచీతూచీ మాట్లాడాలని , లేకుంటే తనకే కాదు పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని ఆలీ సన్నిహితులు సలహా ఇస్తున్నారట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle