newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

కమలం గూటికి రాయపాటి?టీడీపీకి షాక్ తప్పదా?

19-07-201919-07-2019 08:41:35 IST
Updated On 19-07-2019 15:30:56 ISTUpdated On 19-07-20192019-07-19T03:11:35.423Z19-07-2019 2019-07-19T03:11:29.103Z - 2019-07-19T10:00:56.559Z - 19-07-2019

కమలం గూటికి రాయపాటి?టీడీపీకి షాక్ తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... తెలుగు రాష్ట్రాల్లోనూ తన బలాన్ని పెంచుకునేందుకు స్కెచ్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కొద్దిరోజుల క్రితం అమిత్ షా పర్యటనలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. తాజాగా మాజీ ఎంపీ, రాయపాటి సాంబశివరావుని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే... ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.

రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాయపాటి రాకను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ కన్నా మాటను కాదని రాయపాటిని తీసుకుంటే.. కన్నా వేరే ఆలోచన చేస్తారని అంటున్నారు. 

అయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను  చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం.

ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతోపాటు.. పలు సమస్యలను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... రాయపాటి మాత్రం పార్టీ మారాలా లేదా టీడీపీలోనే కొనసాగాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాను బీజేపీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని,. ఆ పార్టీలో చేరాలని బీజేపీ నేతలు తనను ఆహ్వానించిన విషయం నిజమేనని రాయపాటి అన్నారు.

2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి మళ్లీ పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడితే టీడీపీకి నష్టం గ్యారంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle