newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

కన్నా అనే నేను.. ఏపార్టీ వాడినో చెప్పండి సామీ!

02-10-201902-10-2019 10:54:50 IST
2019-10-02T05:24:50.521Z02-10-2019 2019-10-02T05:24:47.435Z - - 06-12-2019

కన్నా అనే నేను.. ఏపార్టీ వాడినో చెప్పండి సామీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కన్నా లక్ష్మీనారాయణ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షులు. మరి ఏ పార్టీకి చెందిన వారినో చెప్పాలని అడగడం ఏంటంటారా? ఇప్పుడు ఆయన పరిస్థితి అలానే ఉంది. కన్నా గురించి కొంచెం వెనక్కు వెళ్తే దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులతో ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ హయంలోనే మంత్రిగా కూడా పనిచేశారు. అయన మరణానంతరం కొందరు జగన్ వెంట వెళ్లినా కన్నా మాత్రం కారణాలేమైనా ఆ వైపు దూకలేకపోయారు. టీడీపీతో బీజేపీ సహవాసం.. రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితుల్లో కమలం గూటికి చేరారు. ఇదంతా పాత కథే.

ఇక మొన్నటి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిలో బీజేపీ నుండి గెలిచి చట్టసభలకు వెళ్లడమే కష్టమే అన్న భావనలో కన్నా చూపు వైసీపీ వైపు మళ్లిందని ప్రచారం జరిగింది. ఒకదశలో ఇక లాంఛన చేరికే మిగిలివుందని రంగు డబ్బాలలో మోత మ్రోగింది. అయితే బీజేపీ హైకమాండ్ అనబడే మోడీ-షాల లాలనతో ఆగిన కన్నా రాష్ట్ర పార్టీకి చీఫ్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీకి అధ్యక్షుడే అయినా కన్నాకు వ్యక్తిగతంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కానీ దేశాన్ని పాలించే పార్టీ కదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై దూకుడు మెయింటైన్ చేస్తున్నారు.

కన్నా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పట్టుమీదున్న విద్యుత్ సమీక్షల దగ్గర నుండి టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకాలు.. రాష్ట్రంలో ఇసుక కొరత.. సంక్షేమ పథకాలలో వైసీపీ నేతల పక్షపాతం, రైతు భరోసాలో కేంద్రం వాటా వరకు ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలను పరిశీలిస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. అధికార పార్టీ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగి ప్రతిపక్ష టీడీపీకి వంత పాడుతున్నారని విమర్శలను తిప్పుకోడుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ నుండి జంప్ చేసిన కొందరు నేతల స్క్రిప్ట్ ను కన్నా చదువుతున్నారని ఆరోపిస్తున్నారు.

మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ కూడా కన్నాపై అదే ఆరోపణలు చేసింది. టీడీపీ-బీజేపీ మధ్య వైరం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కన్నా కూడా టీడీపీ నేతలపై కత్తికట్టి విమర్శలకు దిగారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి కన్నా మౌత్ పీస్ గా మారారని టీడీపీ నేతలు విమర్శించారు. ఏకంగా అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రంలో వైసీపీ బీజేపీకి బీ-టీమ్ అయితే రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి బీ-టీమ్ అంటూ హోరెత్తించారు.

ఇప్పుడు బీజేపీ పార్టీని ఒక్క మాట అనడం లేదు కానీ కన్నాను మాత్రం వైసీపీ నేతలు టార్గెట్ చేసి విరుచుకుపడుతున్నారు. కానీ కన్నా మాత్రం అసలు వెనక్కు తగ్గడం లేదు. అన్నట్లు మరో రెండు రోజులలో అధికార పార్టీపై రణభేరికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. మరి వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle