newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కత్తులు దూసిన కోళ్ళు.. చేతులు మారిన కోట్లు

17-01-201917-01-2019 16:20:29 IST
Updated On 17-01-2019 16:58:50 ISTUpdated On 17-01-20192019-01-17T10:50:29.065Z17-01-2019 2019-01-17T10:50:23.625Z - 2019-01-17T11:28:50.004Z - 17-01-2019

కత్తులు దూసిన కోళ్ళు.. చేతులు మారిన కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళు కత్తులు దూశాయి. కోట్లు చేతులు మారాయి. కో అంటే కోడి...కో అంటే కోట్లు అన్నంతగా సీన్ మారిపోయింది. పోలీసులు, కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా కోడిపందేలు, గుండాట, పేకాట యథేచ్ఛగా సాగిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజధాని ప్రాంతం కృష్ణా జిల్లాలో కోడిపందేల రూపంలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని అంచనా. ఎన్నికల వేళ కావడంతో వైసీపీ, టీడీపీ నేతలు పార్టీల పేరుతో కోడిపందేలు కూడా నిర్వహించారు. ఈ కోడిపందేలకు తెలంగాణ ప్రముఖులు, మాజీ మంత్రులు కూడా తరలిరావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. సంక్రాంతి పేరుతో గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా శృతిమించాయి రికార్డింగ్ డ్యాన్స్‌లు. మూడురోజుల పాటు రాజకీయ వత్తిళ్ళతో కోడిపందేలు జరిగాయి. 

కృష్ణా జిల్లాలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు పోటాపోటీగా శిబిరాలను నిర్వహించారు. ఎప్పటిలాగే పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం తాము సమర్ధంగా కోడి పందేలను అడ్డుకున్నామని చెబుతున్నారు. కేసుల విషయంలో తమకు తోచిన అంకెల లెక్కలు చెబుతున్నారు.  గోదావరి జిల్లాలలో పాటు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న గుడివాడ. కైకలూరు ప్రాంతాలలో కోడిపందేలు జోరు కొనసాగాయి. కొన్ని కోళ్ళకు కత్తులు కడితే మరికొన్ని చోట్ల కత్తులు లేకుండా పోటీలు నిర్వహించారు. కోడిపందేల బరుల్లో అయితే మద్యం, చికెన్ పకోడీలు బాగా అమ్ముడయ్యాయి. అందునా ఓడిపోయిన కోడిపుంజులతో తయారుచేసిన చికెన్ పకోడీలు వేలాదిరూపాయల ధర పలికాయి. తూర్పుగోదావరి తీరంలోని లంక గ్రామాల్లో అయితే కోడిపందేలు, గుండాటలు బాగా జరిగాయి. 

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డి గూడెం, నరసాపురం ప్రాంతాల్లో కోడి పందేల బరులు హైటెక్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాగాయి. తెలంగాణ, కర్ణాటక, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్థానిక జూదరులతో సవాల్‌ విసిరారు. పోలీసులు పత్తా లేకపోవడంతో పందెంరాయుళ్ళది ఆడింది ఆట పాడింది పాట. ఒక్కో పందెం 4 నుంచి 5 లక్షల వరకు చేరింది. భీమవరంలో పార్టీల వారీగా నేతలు పోటా పోటీగా బరుల్లో పందేలు వేశారు. ఈ ఏడాది గెలిచేది ‘మా పుంజో.. మీ పుంజో’ తేలిపోవాలంటూ ఎన్నికల వాతావరణం సృష్టించారు. పాలకొల్లు మండలంలో వైసీపీ, టీడీపీ విడివిడిగా పందేల బరిని నిర్వహించాయి. ఉండి నియోజకవర్గంలోనూ ఇదే తంతు సాగింది. ఈ మూడు రోజుల్లోనే ‘పశ్చిమ’ అంతటా సరాసరిన రూ.150 కోట్లకు పైగానే చేతులు మారాయంటున్నారు. కోనసీమలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. నిర్వాహకులు కుర్రకారుని అదుపుచేయలేకపోయారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కోడిపందేలు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో కోడిపందేల నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle