newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

29-05-202029-05-2020 16:53:34 IST
Updated On 29-05-2020 18:56:31 ISTUpdated On 29-05-20202020-05-29T11:23:34.652Z29-05-2020 2020-05-29T11:22:38.065Z - 2020-05-29T13:26:31.122Z - 29-05-2020

 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వంత జిల్లా కడపలో పర్యటనకు సీఎం జగన్ రెడీ అవుతున్నారు. జూన్ 8వ తేదీవైయస్ రాజశేఖర్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన ఘాట్‌లో  కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్నారు . అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.  జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో జూలై 7వ తేదీ పర్యటించనున్నారు.

ట్రిపుల్‌ ఐటీలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ట్రిపుల్‌ఐటీ క్యాంప్‌సలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన, రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తారని ట్రిపుల్‌ఐటీ వర్గాలు తెలిపాయి. 

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు  ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ట్రిపుల్‌ఐటీ ఏఓ మోహన్‌కృష్ణ, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. ట్రిపుల్‌ఐటీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు.  జూలై 7వ తేదీ ముఖ్యమంత్రి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికారులకు ఎంపీ తెలిపారు.

అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కాగా 7వ తేదీ ట్రిపుల్‌ఐటీలో కార్యక్రమాల్లో పాల్గొనే సీఎం జగన్‌ తర్వాతి రోజు జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పించనున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకు సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించేందుకు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి జూన్‌ మొదటి వారంలో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీకి రానున్నట్లు తెలిసింది. మొత్తం మీద కడప పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా వైసీపీ నేతలు కృషిచేస్తున్నారు. 

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   14 minutes ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   29 minutes ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   35 minutes ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   37 minutes ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   an hour ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   an hour ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   14 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   21 hours ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   a day ago


ఫీజుల దందా మొదలెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్.. ఈటల హెచ్చరిక

ఫీజుల దందా మొదలెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్.. ఈటల హెచ్చరిక

   12-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle