newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

11-07-202011-07-2020 08:55:10 IST
Updated On 11-07-2020 11:35:51 ISTUpdated On 11-07-20202020-07-11T03:25:10.912Z11-07-2020 2020-07-11T03:25:03.665Z - 2020-07-11T06:05:51.784Z - 11-07-2020

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కడప ఎయిర్ పోర్టుకు మహర్థశ పట్టనుంది. ఇప్పటికే అంచెలంచెలుగా ఎయిర్ పోర్ట్ అభివృద్ది చెందుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఎంపీ అవినాష్  రెడ్డి కృషి వల్ల నైట్ ల్యాండ్ కు అవసరమైన కీలక అనుమతులు వచ్చాయి. దీంతో త్వరలోనే కడప ఎయిర్ పోర్ట్ లో రాత్రి వేళల్లో కూడా విమానాలు దిగనున్నాయి. ఇంతకీ అనుమతులు ఎలా వచ్చాయి. ఈ పనులు పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది. అవి పూర్తి అయితే కడప ఎయిర్ పోర్ట్ ఎలాంటి అభివృద్ది చెందుతుందో చూద్దాం. 

గతంలో కడప జిల్లా అంటే వెనుక బడిన ప్రాంతంగా ఉండేది. అయితే మాజీ సీఎంగా వైయస్సార్ వచ్చాక ఆయన కడప జిల్లా వాసే కావడంతో జిల్లా అభివృద్దిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అనేక పరిశ్రమలతో తీసుకుని రావడంతో పాటు కడప ఎయిర్ పోర్ట్ కు కూడా స్థాపించాలని నిర్ణయించారు. దానికి కావాల్సిన స్థల సేకరణ కూడా చేసి కేంద్రానికి పంపి ఎయిర్ పోర్ట్ మంజూరు చేశారు. అయితే ఆయన మరణంతో తరువాత కొంత కాలం కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ది ఆగిపోయింది. నామమాత్రపు పనులు చేపట్టి అభివృద్దిగా చూపించారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతో కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులు ఊపందుకున్నాయి. 

విమాన సర్వీసులు పెంచడంతో పాటు ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. రోజులు నాలుగు సర్వీసులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నైట్ ల్యాండింగ్ లేకపోవడంతో సర్వీసులు పెరగడానికి అవరోధంగా మారింది. దీనిపై దృష్టి పెట్టిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అధికారులతో మాట్లాడి నివేదికలు సిద్దం చేయించారు. ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఈ విషయంపై పలుమార్లు నేషనల్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ప్రస్తావిస్తూ వచ్చారు. 

అవినాష్ వినతులకు కేంద్రం స్పందించింది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో నైట్ ల్యాండింగ్ కు కావాల్సిన అనుమతులను అటవీ శాఖ  అధికారులు మంజూరు చేశారు. దీంతో నైట్ ల్యాండింగ్ కు కావాల్సిన నాలుగు రకాల అనుమతుల్లో అతి ముఖ్యమైన అటవీ శాఖ అనుమతులు లభించాయి. అనుమతులు రావడంతో పనులు ప్రారంభిస్తున్నట్లు కడప ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. 

గతంలో వైయస్సార్ టైంలోనే కడప ఎయిర్ పోర్ట్ అభివృద్దికి అడుగులు పడ్డాయని , తరువాత కాలంలో నిర్లక్ష్యానికి గురి అయ్యిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతో పాటు ఎంపీగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చలు జరుపుతూ ఎయిర్ పోర్ట్ అభివృద్దికి కృష్టి చేస్తున్నారంటున్నారు కడప వాసులు.

నైట్ ల్యాండింగ్ పనులు పూర్తి అయితే కడప విమానాశ్రయానికి విమాన సర్వీసులు పెరుగుతాయని తద్వారా జిల్లా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు. నైట్ ల్యాండింగ్ కోసం క్లిష్టతరమైన అటవీ శాఖ అనుమతులు వచ్చేందుకు కృష్టి చేసిన అవినాష్  రెడ్డిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.  విమానాల రాకపోకలు పెరిగితే.. ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని కడప వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

(కడప ప్రతినిధి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సౌజన్యంతో)

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

   8 hours ago


 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   13 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   14 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   16 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   17 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   17 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   17 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   17 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   18 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle