newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

‘కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీతోనే ఉంటా’

21-10-201921-10-2019 15:06:28 IST
Updated On 21-10-2019 15:06:26 ISTUpdated On 21-10-20192019-10-21T09:36:28.509Z21-10-2019 2019-10-21T09:34:41.840Z - 2019-10-21T09:36:26.907Z - 21-10-2019

‘కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీతోనే ఉంటా’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నుంచి వలసలు బాగా పెరిగిపోతున్న వేళ.... విజయవాడలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నారన్న వార్తలు పార్టీ క్యాడర్ ని నిర్లిప్తతకు గురిచేస్తోంది.  ఈనేపథ్యంలో తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్ని అవినాష్ స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ‘‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను’’ అని దేవినేని అవినాష్ ఒక్క మాటతో తేల్చిపారేశారు. 

గత కొన్ని రోజలుగా అవినాష్ టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు.

గుంటూరులో ప్రెస్‌మీట్ నిర్వహించిన అవినాష్.. వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తన పాలనలో అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఇసుక సరఫరా లేక లక్షలాది కార్మిక కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, ఆకలికి తట్టుకోలేక చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఈ నెల 24న టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరత విషయంలో దీక్షలు చేపడుతున్నామని, పెద్ద ఎత్తున ప్రజలు ఇందులో పాల్గొంటారన్నారు.

టీడీపీకి షాక్..యువనేత గుడ్‌బై..? వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్‌

టీడీపీలో కీలకంగా ఉన్న నేతలపై అధికార పార్టీ తప్పుడు కేసులు పెడుతోందన్నారు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం శోచనీయమన్నారు. నిరుద్యోగులుకు పూర్తి స్థాయి న్యాయం జరగడంలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle