newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఓ వైపు బెంగ‌.. మ‌రోవైపు భ‌యం..!

22-06-201922-06-2019 08:14:26 IST
2019-06-22T02:44:26.955Z22-06-2019 2019-06-22T02:37:36.606Z - - 16-12-2019

ఓ వైపు బెంగ‌.. మ‌రోవైపు భ‌యం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్ష‌భంతో కూరుకుపోతోంది. ఆ పార్టీ చరిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత దారుణ ప‌రాజ‌యాన్ని ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో మూట‌గ‌ట్టుకున్న ఆ పార్టీకి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు తీవ్ర సంక‌టంగా మారాయి. నేత‌ల వ‌ల‌స‌లు చూస్తుంటే ఆ పార్టీకి ప్ర‌మాదం ముంచుకొస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఓట‌మితో నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ ఇప్పుడు నాయ‌కులు పార్టీ మారుతుండ‌టంతో మ‌రింత ఆందోళ‌న‌తో ఉన్నారు.

అయితే, చంద్ర‌బాబు నాయుడు మాత్రం త‌మ్ముళ్ల ధైర్యం నూరి పోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు కొత్త కాద‌ని, ధైర్యంగా ఉండాల‌ని చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉండి వివిధ ప‌ద‌వులు అనుభ‌వించిన వారే ఇలా క‌ష్ట‌కాలంలో పార్టీని వీడి వెళ్ల‌డాన్ని కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

పైగా కాపు సామాజ‌క‌వ‌ర్గ నేత‌ల ర‌హ‌స్య భేటీ, కొంద‌రు ఎమ్మెల్యేల‌తో క‌లిసి గంటా శ్రీనివాస‌రావు బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం టీడీపీ శ్రేణుల‌ను మ‌రింత కృంగ‌దీస్తోంది.

కేవ‌లం పార్టీ అధికారాన్ని కోల్పోయి నెల కూడా కాక‌ముందే నేత‌లు పార్టీని వీడేందుకు ప్ర‌ధానంగా భ‌విష్య‌త్‌పై బెంగ‌, భ‌య‌మే కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురుకావ‌డంతో ఇప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఆ పార్టీ నేత‌లు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌య‌స్సురిత్యా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇప్పుడున్నంత యాక్టీవ్‌గా రాజ‌కీయాలు చేయ‌లేర‌ని అంచ‌నా వేస్తున్నారు.

చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయ‌క‌త్వం క‌నిపించ‌డం లేదు. నారా లోకేష్ ఫెయిల్ అయ్యార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఆయ‌న పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మే అని అంచ‌నా వేస్తున్నారు.

దీంతో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నే బెంగ‌తో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అయితే, ఓడినా ఇప్పటివ‌ర‌కైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బ‌లంగా ఉంది. నేత‌లు వెళ్లినా పార్టీ క్యాడ‌ర్ మాత్రం ఇప్ప‌ట్లో చెక్కుచెద‌ర‌దు. అయినా, టీడీపీలో ఉంటే ప్ర‌తిప‌క్షంలో ఎన్నేళ్లు ఉండాలో అనే ఆందోళ‌న నేత‌ల్లో ఉంది.

ఇక‌, బీజేపీ వైపు టీడీపీ నేత‌లు చూడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం కేసుల భ‌యం కూడా క‌నిపిస్తోంది. బీజేపీలో చేరిన న‌లుగురు ఎంపీల్లో ఇద్ద‌రిపై తీవ్ర‌మైన ఆర్థిక‌ప‌ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వారిపై ఎన్నిక‌ల ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత వివిధ విచార‌ణ సంస్థ‌లు విచార‌ణ చేస్తున్నాయి. టీడీపీలోనే ఉంటే కేసులు మ‌రింత ఉచ్చులా బిగుస్తాయ‌ని వారు భ‌య‌ప‌డే పార్టీని వీడార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేంద్రంలో, రాష్ట్రంలో తాము ప్ర‌త్య‌ర్థుల్లా కాకుండా శ‌త్రువుల్లా చూసిన బీజేపీ, వైసీపీ అధికారంలోకి రావ‌డంతో టీడీపీలోనే ఉంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని చాలామంది నేత‌లు భావిస్తున్నారు. నెల రోజుల్లోనే ఆ పార్టీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబంపై 15 కేసులు న‌మోదుకావ‌డం, అయినా పార్టీ అండ‌గా లేద‌ని భావ‌న నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

రేపు త‌మ ప‌రిస్థితి కూడా ఇంతేనా అనే అభ‌ద్ర‌తాభావం కూడా ఉంది. వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా చేయాల్సిందే అని జ‌గ‌న్ క‌చ్చితంగా కండీష‌న్ పెట్టారు. దీంతో ఇక గ‌త్యంత‌రం లేక వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle