newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

ఓ వైపు జోష్.. మరో వైపు డౌట్స్..!

13-04-201913-04-2019 07:22:37 IST
2019-04-13T01:52:37.285Z13-04-2019 2019-04-13T01:52:33.945Z - - 24-07-2019

ఓ వైపు జోష్.. మరో వైపు డౌట్స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసాయి. ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం చూపించి ఓట్లేశారు. గత ఎన్నికల కంటే వోటింగ్ శాతం పెరిగి సుమారు 80 శాతం నమోదైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మే 23 వరకు, అంటే ఇంకా 40 రోజులు ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో పార్టీల్లో టెన్షన్ పట్టుకుంది. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

ఎన్నికలు ముగిసాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కనిపిస్తుంది. కింది స్థాయి క్యాడర్ నుంచి పార్టీ అధినేత జగన్ వరకు గెలుపు పై పూర్తి ధీమాగా ఉన్నారు. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం తమకు అనుకూలమని వైసీపీ భావిస్తుంది. ఈసారి కచ్చితంగా తమ ప్రభుత్వం రాబోతోందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. 

ఎన్నికల అనంతరం జగన్ కూడా ధీమాగా మాట్లాడారు. నిన్న కూడా అయన వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ బృందాన్ని కలిశారు. ఐప్యాక్ ఆఫీసుకి వెళ్లి మరీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం తెస్తోంది. తమ అధినేత ధీమాగా ఉండటంతో తమ గెలుపు ఖాయమని వారు నమ్మకంగా ఉన్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మాత్రం కొంత అపనమ్మకం ఏర్పడింది. ఇందుకు అధినేత చంద్రబాబు వైఖరి ప్రధాన కారణం. పోలింగ్ జరుగుతుండగానే ఈయన ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడంతో పార్టీ శ్రేణుల్లో అభద్రతాభావం నెలకొంది. పోలింగ్ ముగిసాక నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  సాక్షాత్తూ సీఎస్ సుబ్రహ్మణ్యాన్ని కూడా వదలలేదు. ఎంతో పాలనానుభవం వున్న చంద్రబాబు హుందాతనం మరచిపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. 

ఈవీఎంలపై తమకు ఏమాత్రం నమ్మకం లేదన్న ఆయన అసలు ఇవి ఎన్నికలే కాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఓటమిని అంగీకరించినట్లుగా ఉన్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. చివరిగా తామే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని, మే 23 తర్వాత మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు. అయినా ఆయన వ్యక్తం చేసిన అనుమానాల తర్వాత ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించడం లేదు.

అయితే చంద్రబాబు కానీ, టీడీపీ శ్రేణులు కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ముందు తీసుకువచ్చిన పసుపు - కుంకుమ, పింఛన్ల పెంపు పథకాలు టీడీపీకి బాగా పని చేశాయని అంటున్నారు. ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం టీడీపీకి కలిసి వస్తుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అయన వ్యాఖ్యలతో పార్టీ క్యాడర్‌లో గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle