newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఓడినా మార్కులు కొట్టేస్తున్నారే..!

16-09-201916-09-2019 08:03:16 IST
Updated On 19-09-2019 15:22:11 ISTUpdated On 19-09-20192019-09-16T02:33:16.189Z16-09-2019 2019-09-16T02:33:06.815Z - 2019-09-19T09:52:11.365Z - 19-09-2019

ఓడినా మార్కులు కొట్టేస్తున్నారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌కాశం జిల్లాలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. రాజ‌కీయంగా దూకుడు స్వ‌భావాన్ని క‌లిగి ఉన్న ఆయ‌న వివాదాల‌ను సైతం వెంటేసుకొని తిరుగుతారు.

మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య శిష్యుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన ఆయ‌న 2009లో కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించారు. ప్ర‌జ‌ల్లో గ‌ట్టి ప‌ట్టు ఏర్ప‌రుచుకున్న ఆయ‌న 2014లో స్వ‌తంత్రంగా పోటీ చేసి గెలుపొందారు.

త‌ర్వాత తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, జిల్లా రాజ‌కీయాల్లో ఆమంచి దూకుడుతో ఆ పార్టీలోనే ఆయ‌న‌కు శ‌త్రువులు త‌యార‌య్యారు. అయినా ఆమంచి వెన‌క్కు త‌గ్గ‌కుండా పార్టీలో యాక్టీవ్‌గా ఉన్నారు.

నంద్యాల బైఎల‌క్ష‌న్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, తాను పార్టీ కోసం ఎంత ప‌ని చేసినా అధినేత త‌న‌కు గుర్తింపు ఇవ్వ‌డం లేద‌నే బాధ‌తో ఆమంచి ఇటీవ‌లి ఎన్నిక‌ల ముందు పార్టీని వీడారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను పార్టీలోనే ఉంచేందుకు చంద్ర‌బాబు బాగానే ప్ర‌య‌త్నించారు. రెండుసార్లు పిలిపించుకొని బుజ్జ‌గించారు. అయినా విన‌ని ఆమంచి వైసీపీలో చేరారు.

అయితే, పార్టీలో చేరిన నాటి నుంచే టీడీపీ ప‌ట్ల అంత‌కాలం త‌న‌లో ఉన్న అసంతృప్తిని కోపంగా మార్చుకున్నారు. టీడీపీలో ఉన్న కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు నేత‌ల‌ను వైసీపీలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

చీరాల‌లో మంచి ప‌ట్టు ఉన్నా, ఎన్నిక‌ల్లో మంచి వ్యూహాల‌తో ముందుకెళ్తార‌నే పేరున్నా ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆమంచికి చేదు ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆయ‌న‌పై సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ్ విజ‌యం సాధించారు.

అయితే, కొంత‌కాలం పాటు ఓట‌మితో సైలెంట్ అయిన ఆయ‌న తిరిగి యాక్టీవ్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో అన‌ధికార ఎమ్మెల్యేగా చ‌లామ‌ణి అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తాను చెప్పిన‌ట్లే ప‌నులు జ‌రిగేలా చూసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీలో అసంతృప్తిగా ఉండి, బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను వైసీపీలోకి తేవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీలో చేర‌డానికి రూట్ క్లీయ‌ర్ చేశారు ఆమంచి.

మ‌రికొంద‌రు నేత‌ల‌తో సైతం ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం ఉంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుపై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అందుకే, ఓడినా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులే కొట్టేస్తున్నారట‌ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle