newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

‘‘ఓట్లు, సీట్లు కోసం పోటీచేయలేదు’’

24-05-201924-05-2019 15:35:45 IST
Updated On 26-06-2019 16:34:36 ISTUpdated On 26-06-20192019-05-24T10:05:45.933Z24-05-2019 2019-05-24T10:05:43.450Z - 2019-06-26T11:04:36.766Z - 26-06-2019

‘‘ఓట్లు, సీట్లు కోసం పోటీచేయలేదు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రశ్నించేందుకు వచ్చానంటూ రాజకీయ ప్రవేశం చేసిన సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఫలితాల అనంతరం మీడియాతో ముచ్చటించారు. కాస్త ఎమోషన్ అయ్యారు. రాజకీయాలు ఖరీదైనవి మారాయని, కానీ జనసేన రాజకీయాల్లో కొత్త సంప్రదాయం నెలకొల్పామన్నారు పవన్. అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాము ఓట్ల కోసం ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ స్పష్టం చేశారు.

Image result for rapaka varaprasad janasena

రాజోలులో MLA గా గెలిచిన రాపాక వరప్రసాద్ రావుతో పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు, జనసేనకు ఓటు వేసిన ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ రావు విజయం సాధించారు. కేవలం ఒక్క సీటు మాత్రమే జనసేనకు దక్కింది. జనసేన అభ్యర్ధికి 50,053 ఓట్లు వచ్చాయి. 

బలమైన మెజారిటీ సాధించిన వైఎస్ జగన్‌, ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో... ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రెండు స్ధానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. తుది శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు. ఎన్నికలు ముగిశాక, ఫలితాలకు ముందు పవన్ ఇదే విషయం చెప్పారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్పు కోసం ఎంత పోరాటం చేశామన్న ఆలోచనే చేస్తానననారు. జనసేన ఓ ఆశయంతో పనిచేస్తుందన్నారు. అయితే జనసేన మాత్రం టీడీపీకి ఓట్లకు గండికొట్టిందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు మంచి ఓట్లు సాధించారు. విశాఖలో గెలుస్తారని భావించిన వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి.

అమలాపురం లోక్ సభ సీటులో పోటీచేసిన జనసేన అభ్యర్ధి డీఎంఆర్ శేఖర్ 2,54,848ఓట్లు సాధించారు. నరసాపురం లోక్ సభకు పోటీచేసిన పవన్ సోదరుడు నాగబాబుకు 2,50,289 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద జనసేన ఫలితాలు క్యాడర్‌కు ఈ ఫలితాలు రుచించడం లేదు. 

మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తమ పరిశీలనకు వచ్చిన వివిధ అంశాలను నేతలు పవన్‌కు వివరించారు. వచ్చే నెల నుంచి మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థులు వచ్చి పవన్‌ను కలిశారు. ఎన్నికల సరళి, కౌంటింగ్‌ జరిగిన విధానాన్ని పవన్‌కు వివరించారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle