newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఓటు కోసం కోటి (నోటు) ఉపాయాలు

10-04-201910-04-2019 12:34:13 IST
Updated On 11-04-2019 15:03:05 ISTUpdated On 11-04-20192019-04-10T07:04:13.895Z10-04-2019 2019-04-10T07:04:12.307Z - 2019-04-11T09:33:05.442Z - 11-04-2019

ఓటు కోసం కోటి (నోటు) ఉపాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
500, 1000...5000... ఇవి ఏంటనుకుంటున్నారా? ఇవేం ర్యాంకులు కాదు.. ఓటుకు నోటు లెక్కలు. ఏపీలో చావోరేవో అన్నట్టుగా సాగుతున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నోట్ల పంపిణీలో పోటీపడుతున్నారు. జనసేన అభ్యర్థులు కూడా ఓటుకు రూ.2500 దాకా పంచుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, ఉపకరణాలు, ఇతర తాయిలాలు పంపిణీ చేసేందుకు పార్టీలు అనంతకోటి ఉపాయాలతో ముందుకు వెళ్తున్నాయి. నగదు పంపిణీపైనే ప్రధానంగా దృష్టి పెట్టినా అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులకు చిక్కకుండా కూపన్ల రూపంలో బహుమతులు అందిస్తున్నారు.

కొన్ని నియోజక వర్గాల్లో ఓటుకు రూ.500 చొప్పున, మరికొన్ని చోట్ల రూ.1,000 చొప్పున నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఒక నియోజక వర్గంలో రూ.2 వేలు నుంచి ఐదువేలు దాటినట్టు తెలుస్తోంది.  ఒక విడత నగదు పంపిణీ పూర్తి చేసిన పార్టీల వారు ప్రత్యర్థి పార్టీ మళ్లీ పంచితే దానికి అదనంగా ఇంకొంత ఇవ్వాలన్న యోచనలోనూ ఉన్నారు. కోట్ల రూపాయల పంపిణీ మాత్రం యథేచ్ఛగా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఎలాగైనా ఈసారి సీట్లు చేజిక్కుంచుకోవాలని వైసీపీ తహతహలాడుతోంది. వీలైతే ఓటర్ల ఇంటికే నగదు పంపిణీ జరుగుతోంది. ఇది కుదరని చోట ఆన్‌లైన్‌ ద్వారా జమ చేయడం, తపాలా, కొరియర్‌ సర్వీసులు, సరకు రవాణా సంస్థల ద్వారా అందించడం వంటివి కొనసాగుతున్నాయి. 

ఓటరు స్లిప్పుల అందజేత ముసుగులో ఇంటింటికి వెళ్లి ఓటుకు నోటు అందజేస్తున్నారు. మరికొందరు ఈవీఎంలో వరుస సంఖ్య ఆధారంగా అభ్యర్థి గుర్తుతో నమూనా బ్యాలెట్‌ ముద్రించి పంచుతున్నారు. వీటిని ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నారు. ఈ ప్రక్రియకు పార్టీల నేతలు నమ్మకస్తులను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల బంధువులు, కావాల్సిన వ్యక్తులు, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు లేదా పార్టీలు నియమించిన వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు ఎవరో ఒకరు ఇందులో కీలకంగా ఉంటున్నారు. వీరే నగదు లావాదేవీలు నడుపుతారు. వీరికి బూత్‌ కన్వీనర్లు, వార్డు సభ్యులు లాంటి వారు సహాయకారులుగా ఉంటున్నారు. వంద నుంచి రెండొందల ఇళ్లకు ఒక బృందం చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. 

పదివేలకు మంచి ఏజెంట్లు, పార్టీ ముఖ్యులు డబ్బులు తమదగ్గర ఉంచుకోవడంలేదు. ఒక్కో గ్రామంలో నలుగురైదుగురు డబ్బులు తరలిస్తున్నారు. ఓటరు స్లిప్పులను పంపిణీచేసే ముసుగులో డబ్బులు అందిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేరు ఉన్నట్లు ధ్రువీకరణ చేసుకున్నాక సాయంత్రం వేళ వారికి స్లిప్పులతోపాటు నోటు అందేలా చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచి బుధవారం రాత్రివరకూ ఈ నగదు పంపిణీ జరుగుతోంది. డబ్బులు ఇస్తున్నాం. మీరు ఓటు వేస్తానని ఒట్టేయండంటూ ఓటర్ల నుంచి ప్రమాణాలు కూడా తీసుకుంటున్నారు.

ప్రధానంగా ఒక పార్టీ అనుచరులుగా ముద్రపడిన వారికి ఇతర పార్టీలు సొమ్ములు ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. మరికొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీ వీరాభిమానులకు ఓటు వేయడానికి రావద్దంటూ అధిక మొత్తంలో ముట్టజెబుతున్నారు. తటస్థులకు మాత్రమే డబుల్‌ ధమాకా అందుతోంది. ఏదైనా పార్టీకి చెందిన వారని ముద్రపడిన వారికి ఇతర పార్టీలు నగదు పంచడం లేదు. ప్రధానంగా తటస్థులుగా ఉన్నవారినే తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ఇరు పార్టీలు నగదు అందజేస్తున్నాయి. ఏపార్టీ ఇచ్చినా వారు తీసుకుంటున్నారు. అయితే ఓటెవరికి వేస్తారో మాత్రం అంతుచిక్కడం లేదు. 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle