newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఒక్క ఫోటో.. అనేక చ‌ర్చ‌లు..!

17-12-201917-12-2019 09:10:52 IST
Updated On 17-12-2019 18:08:03 ISTUpdated On 17-12-20192019-12-17T03:40:52.730Z17-12-2019 2019-12-17T03:40:45.702Z - 2019-12-17T12:38:03.735Z - 17-12-2019

ఒక్క ఫోటో.. అనేక చ‌ర్చ‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వారంతా ఉద‌యం లేచింది మొద‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే రాజ‌కీయ నేత‌లు. ప‌త్రిక‌ల్లో, టీవీల్లో దుమ్మెత్తి పోసుకుంటారు. ప్ర‌జ‌ల్లో ఒక‌రికి వ్య‌తిరేకంగా ఒక‌రు ఆందోళ‌న‌లు చేస్తుంటారు.

త‌మ నేత‌ల హ‌డావుడి చూసి అనుచ‌రులు మ‌రింత రెచ్చిపోతారు. వీరిని చూసి ప్ర‌జ‌లంతా ఆ ఇద్ద‌రికీ ప‌డ‌దు, వీరిద్ద‌రికీ ప‌డ‌దు అనే నిర్దార‌ణ‌కు వ‌చ్చేస్తారు. అయితే, త‌మ అల‌క‌లు, కొట్లాట‌లు, కుమ్ములాట‌లు అన్నీ రాజ‌కీయ‌మేన‌ని, వ్య‌క్తిగ‌తంగా తామంతా ఒక్క‌టేన‌ని స్నేహ‌మేరా జీవితం అంటూ పాట పాడుతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొంద‌రు నేత‌లు.

నిన్న‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక ఫోటో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వేర్వేరు పార్టీల‌కు చెందిన‌, నిత్యం రాజ‌కీయంగా పోరాడే పార్టీల నేత‌లు ఈ ఫోటోలో ఒక‌రి భుజాల‌పై ఒక‌రు చేతులు వేసుకొని ఆప్యాయంగా క‌లిసి ఉన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైసీపీ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈ ఫోటోలో ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

వీరిలో గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు ఒకే పార్టీలో ఉన్నా ఇద్ద‌రికీ అస్స‌లు పొస‌గ‌దు. గ‌త ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రూ జిల్లా మంత్రులుగా జిల్లాపై ఆధిప‌త్య పోరు కోసం ప్ర‌య‌త్నించారు. విశాఖ భూకుంభ‌కోణంలో గంటా పాత్ర ఉంద‌నేలా అయ్య‌న్న ఆరోప‌ణ‌లు సైతం చేశారు. కానీ, అనూహ్యంగా వీరి ప‌క్క‌ప‌క్క‌నే నిల‌బ‌డి కాలేజీ విద్యార్థుల్లా ఒక‌రి భుజంపై మ‌రొక‌రు చేతులు వేసి ఫోటోల‌కు పోజులిచ్చారు.

ఇక, ఇదే ఫోటోలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌నిపిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న వైసీపీకి రెబ‌ల్‌గా మారుతున్నారు. ఆ పార్టీ నాయ‌క‌త్వ నిర్ణ‌యాల‌కు ఎదురెలుతున్నారు. స్వంతంగా త‌న ప‌లుకుబ‌డిని పెంచుకుంటున్నారు.

ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఢిల్లీలో ఆయ‌న ఏర్పాటు చేసిన విందుకు 200కు పైగా ఎంపీలు హాజ‌రైన విష‌యం తెలిసిందే. నిత్యంత త‌మ పార్టీని విమ‌ర్శించే టీడీపీ, బీజేపీ నేత‌ల‌తో ఆయ‌న దోస్త్ మేరా దోస్త్ అన్న రీతిలో ఫోటో దిగారు.

ఇక‌, ఈ ఫోటోలో మ‌రో మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గంటా శ్రీనివాస‌రావు, ర‌ఘురామ‌కృష్ణంరాజు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌న్న నేప‌థ్యంలో కామినేని వీరితో క‌లిసి ఉండ‌టం కొత్త చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. అయితే, తామంతా మంచి స్నేహితుల‌మ‌ని, అందుకే విశాఖ‌ప‌ట్నంలోని ఓ హోట‌ల్‌లో క‌లిసి సంతోషంగా గ‌డిపామ‌ని గంటా శ్రీనివాస‌రావు ప్ర‌క‌టించారు.

కానీ, ఈ ఫోటోపైన మాత్రం రాజ‌కీయవ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఫోటో చూసిన ప్ర‌జ‌లు మాత్రం వారంతా బాగానే ఉంటారు.. మ‌న ముందే ఈ కోపాల‌న్నీ అని అనుకుంటున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle