newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఒక్క జీవోతో బద్దలైన 'విశాఖ బాక్సైట్'

27-09-201927-09-2019 10:44:41 IST
Updated On 27-09-2019 17:16:36 ISTUpdated On 27-09-20192019-09-27T05:14:41.888Z27-09-2019 2019-09-27T05:14:14.721Z - 2019-09-27T11:46:36.297Z - 27-09-2019

ఒక్క జీవోతో బద్దలైన 'విశాఖ బాక్సైట్'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మంచీ చెడుల సంగతెలా ఉన్నా ఎప్పటికప్పుడు షాకింగ్ జీవోలతో షేక్ చేసే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క జీవోతో 'విశాఖ బాక్సైట్'ను బద్దలు కొట్టారు. విశాఖ మన్యంలో 30 ఏళ్ల పాటు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ)కి ఇచ్చిన బాక్సైట్ అనుమతులను రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం ఓ వారం క్రితమే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులతో అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,3, గాలిగొండ, చిత్తమగొండి, రక్తకొండ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోనున్నాయి. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ గత ప్రభుత్వం 2015 నవంబరు 5న జీవో నంబరు 97 జారీచేయగా ఈ ప్రభుత్వం రద్దు చేసింది.

విశాఖ ఏజెన్సీ దేశంలో మరెక్కడా దొరకని బాక్సైట్ ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌ టన్నులు, గూడెంలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. అయితే వీటి తవ్వకం వలన జలాశయాలు దెబ్బతిని మైదాన ప్రాంతంలోని నదుల్లోని నీటి ప్రవాహం తగ్గిపోతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మన్యం మావోలకు స్థావరంగా మారుతుందని పలు హెచ్చరికల నేపథ్యంలో విశాఖ బాక్సైట్ రగడ అనుమతి పొందిన రోజుల నుండీ రగులుతూనే ఉంది.

నిజానికి విశాఖ బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ హయంకు ముందే 2004-2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లోని అరకు, సప్పర్ల అటవీ ప్రాంతంలో 240 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల చొప్పన తవ్వి తీసేందుకు తొలుత జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.

అయితే తవ్వకాలకు సంబంధించిన అనుమతులు మంజూరు కాకపోగా 2008లో సప్పర్ల, జెర్రెల ప్రాంతాల్లోని 224 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీసేందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అన్ రాక్‌కు తొలి దశ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే తొలి దశ అనుమతులు మంజూరు చేసినా, మావోయిస్టు హెచ్చరికలు, విపక్షాల ఆందోళలు, 2009 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో కాంగ్రెస్ వెనుకంజ వేసింది. అప్పుడు విపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా అఖిలపక్షాలతో కలిసి అనుమతులను తీవ్రంగా ఖండించారు.

అయితే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో ఉన్న మిత్ర సంబంధాలు, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ తదితర కారణాలతో తవ్వకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. అలా ఏడేళ్ల తర్వాత మొత్తం నాలుగు బ్లాకుల్లో 1,212 హెక్టార్లలో 222 మిలియన్ టన్నుల  బాక్సైట్ తవ్వకాలకు ఎన్డీయే సర్కార్ అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం జివోఎంఎస్ 97 విడుదల చేసింది. ఆ జీవో అప్పట్లో పార్టీలో కూడా చిచ్చు రేపింది. సొంతపార్టీ నేతలే చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పుడు ఆ వ్యహారం పార్టీలో సద్దుమణిగింది.

అయితే జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికల పర్యటన సమయంలో తవ్వకాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మరి కేంద్రంలో అప్పుడూ.. ఇప్పుడూ అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఈ రద్దు నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒప్పందం చేసుకున్న కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ఉంటాయా? ఇప్పటికే పీపీఏల సమీక్షల వంటి విషయాలలో సీఎం జగన్ కేంద్రాన్ని ఖాతరు చేయడం లేదనే చర్చల మధ్యన ఈ బాక్సైట్ ఉత్తర్వులు ఏ ఫలితాలను ఇస్తాయన్నది వేచిచూడాల్సి ఉంది.

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   19 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   21 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   21 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   a day ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   a day ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   a day ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle