newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఒక్క ఊరిలో 5 వేల ప‌రీక్ష‌లు.. క‌రోనాపై గెలిచిన గ్రామం క‌థ ఇది

29-06-202029-06-2020 07:27:09 IST
Updated On 29-06-2020 11:25:03 ISTUpdated On 29-06-20202020-06-29T01:57:09.653Z29-06-2020 2020-06-29T01:57:05.572Z - 2020-06-29T05:55:03.651Z - 29-06-2020

ఒక్క ఊరిలో 5 వేల ప‌రీక్ష‌లు.. క‌రోనాపై గెలిచిన గ్రామం క‌థ ఇది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా వ్యాప్తి దేశ‌మంతా విప‌రీతంగా పెరుగుతున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఓ గ్రామం క‌రోనాపై విజ‌యం సాధించిన తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్ అనే విధానం ఒక్క‌టే క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి మార్గమ‌ని ఈ గ్రామం నిరూపించింది. ప్ర‌భుత్వ యంత్రాంగం, గ్రామ‌వాలంటీర్ల శ్ర‌మ‌, వేగంగా నిర్ణయాలు తీసుకున్న అధికార యంత్రాంగం, ఆ నిర్ణ‌యాల అమ‌లుకు స‌హ‌క‌రించిన గ్రామ‌స్థులు, ఇలా అంతా క‌లిసి ఆ గ్రామం నుంచి క‌రోనా వైర‌స్‌ను పార‌ద్రోలారు. ఈ స‌క్సెస్ స్టోరీ తూర్పు గోదావ‌రి జిల్లా గొల్ల‌ల మామిడాడ అనే గ్రామానిది.

కాకినాడ న‌గ‌రానికి 24 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది గొల్ల‌ల మామిడాడ గ్రామం. పేరుకు గ్రామ‌మే అయినా జ‌నాభా ఎక్కువ‌. సుమారు 15 వేల మంది ఈ గ్రామంలో నివ‌సిస్తారు. గ్రామంలోని ఓ టీ, టిఫిన్ హోట‌ల్ చాలా ఫేమ‌స్‌. అందులో క్యాషియ‌ర్‌గా ప‌ని చేసే ఓ 53 ఏళ్ల వ్య‌క్తి అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్ ఆసుప‌త్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. వైద్యులు అనుమానంతో అత‌డి శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా అత‌డికి క‌రోనా పాజిటీవ్ ఉన్న‌ట్లు తేలింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు అత‌డి ప్రైమ‌రీ కాంటాక్ట్‌ల‌ను ట్రేస్ చేసి 20 మందిని ప‌రీక్షించ‌గా 12 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది.

దీంతో ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంద‌ని గుర్తించిన అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌రోనా సోకిన మొద‌టి వ్య‌క్తి ప‌ని చేసే హోట‌ల్‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చిన‌ట్లుగా తేలింది. దీంతో అంద‌రికీ ప‌రీక్ష‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారులు భావించారు. దేశ‌మంతా లాక్‌డౌన్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంటే గొల్ల‌ల మామిడాడ‌లో మ‌రోసారి లాక్‌డౌన్ విధించారు. గ్రామం మొత్తం రెడ్ జోన్‌గా గుర్తించారు. లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు కొన్ని స‌డ‌లింపులు ఉండేవి. ప్ర‌జ‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి కొంత స‌మ‌యం ఇచ్చేవారు. కానీ, గొల్ల‌ల మామిడాడ‌లో రెండోసారి లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు ఆ స‌మ‌యం కూడా ఇవ్వ‌లేదు. ప్ర‌జ‌లు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా చూసుకున్నారు.

ప్ర‌జ‌లు వారికి కావాల్సిన వ‌స్తువులను సైతం ప్ర‌భుత్వ యంత్రాంగం స‌హాయంతో కొనుగోలు చేశారు. ఫోన్‌లో స్థానిక వాలంటీర్‌కు, ఇత‌ర సిబ్బందికి త‌మ‌కు ఈ వ‌స్తువు కావాల‌ని అని చెబితే వారే స‌ర‌ఫ‌రా చేసే వారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డే ప్ర‌జ‌ల‌కు దాత‌లు స‌రుకులు అందించ‌డం కూడా గ్రామ పంచాయితీ ద్వారానే జ‌రిగింది. ప్ర‌భుత్వ యంత్రాంగం త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం ఇవ్వ‌కుండా అధికార యంత్రాంగం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌జ‌లు కూడా అధికార యంత్రాంగానికి పూర్తిగా స‌హ‌క‌రించి ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.

ఇదే స‌మ‌యంలో గ్రామంలో పెద్ద ఎత్తున క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది ప్ర‌భుత్వం. 15 వేల మంది నివసించే ఈ గ్రామంలో ఏకంగా సుమారు 5 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపారు. వీరిలో సుమారు 120 మందికి క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి మెరుగైన వైద్య సేవ‌లు అందించారు. దీంతో వారంతా కోలుకున్నారు. ప్ర‌స్తుతం గ్రామంలో క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కావ‌డం లేదు. దీంతో రెండోసారి విధించిన క‌ఠిన లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. దీంతో ఇప్పుడు గొల్ల‌ల మామిడాడ గ్రామం పూర్తిగా క‌రోనా ఫ్రీగా మారింది. గ్రామంలో సాధార‌ణ జ‌న‌జీవ‌నం ప్రారంభ‌మైంది. ఇలా ఈ గ్రామంలో క‌రోనాపై విజ‌యం సాధించ‌డంలో ఆద‌ర్శ గ్రామంగా నిలిచింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle