newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

‘ఒక్కసారి చెప్తే.. బాబు పీకిన క్లాస్’

21-12-201821-12-2018 15:35:29 IST
Updated On 21-12-2018 15:57:37 ISTUpdated On 21-12-20182018-12-21T10:05:29.607Z21-12-2018 2018-12-21T10:00:47.593Z - 2018-12-21T10:27:37.841Z - 21-12-2018

‘ఒక్కసారి చెప్తే.. బాబు పీకిన క్లాస్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో టీడీపీ నాయకుల తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్‌ఛార్జిలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు. మరో రెండునెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుందని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోనన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలపై చంద్రబాబు కొరడా ఝుళిపించారు. అసెంబ్లీ ఎన్నికలంటే ఒక్కరిలోనూ సీరియస్‌నెస్ లేదని మండిపడ్డారు. ఇవాళ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్‌గా సాగింది.  ఈఏడాది కోటి సభ్యత్వ నమోదు టార్గెట్‌గా పెట్టుకున్నామని, ఇప్పటివరకూ 50 లక్షలు సభ్యత్వాలు మాత్రమే పూర్తిచేశారన్నారు. ఈనెల 24వ తేదీతో సభ్యత్వ గడువు ముగుస్తోంది. ఈనేపథ్యంలో తక్కువ వ్యవధిలో మరో యాభైలక్షల సభ్యత్వం ఎలా పూర్తవుతుందని చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తంచేశారు. శుభకార్యాల వల్ల నేతలు టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదని నేతలు చెప్పడం పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తి చెందారు. వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా అంటూ నిలదీశారు. ‘‘గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా. తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాన్ఫిడెన్స్ ఉండవచ్చని, ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచుతుందన్నారు. 

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో మొదటి 3 స్థానాల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో టీడీపీ సభ్యత్వం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదుపై చంద్రబాబు విశ్లేషించారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేస్తూ కాదని హితవు పలికారు. ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని కూడా కొందరు గమనించడం లేదని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సీరియస్‌గా తీసుకోలేని వారికి మళ్లీ అన్ని పనులూ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్ధం చేసుకోవడం లేదని, ఇలాగే ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. రాబోయే 6 నెలలు తాను కఠినంగానే ఉంటానని స్పష్టంచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వస్తే సంతోషమే అన్నారు చంద్రబాబు. ప్రజలను గందరగోళ పరిచేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ తనకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారని. అదేంటో చూద్దామన్నారు చంద్రబాబునాయుడు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle