newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

ఒకే దఫాలో 1.26 లక్షల ఉద్యోగ నియామకాలు.. చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం

01-10-201901-10-2019 08:40:29 IST
2019-10-01T03:10:29.244Z01-10-2019 2019-10-01T03:10:27.119Z - - 21-01-2020

ఒకే దఫాలో 1.26 లక్షల ఉద్యోగ నియామకాలు.. చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాక్షరాలతో అరుదైన చరిత్రను లిఖించింది. సోమవారం ఏకకాలంలో 1.26 లక్షల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన నియమించి అనితరసాధ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. ఏరకంగా చూసినా లక్షకుపైగా ఉద్యోగాలను ఏకకాలంలో కల్పించడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామీణ ప్రజలకు 500 రకాల ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటులో భాగంగా ఇంత భారీస్థాయిలో ఉద్యోగాల నియామకాలను చేపట్టడం జాతీయవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నది గమనార్హం.

ఏ ప్రభుత్వమైనా సరే శాశ్వత ఉద్యోగాలు కల్పించి ఉపాధి మార్గం చూపించాలని ప్రజలు నిత్యం కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నవి అత్యంత కీలకమైన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో యువత ఉద్యమ బాట పట్టింది కూడా ఉద్యోగాల కోసమే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు...అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం విప్లవ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల వరకు నిత్యం పోరాటాలు చేస్తునే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఉద్యమాలు జరగకుండానే రికార్డు స్థాయిలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు నెలకొల్పారు. 

పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాడు తాను చెప్పిన మాటను అక్షర సత్యం చేసి అక్టోబర్‌ 2 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి చూపిస్తున్నారు. తెలుగునేలపై సరికొత్త ఉద్యోగ విప్లవాన్ని సృష్టించి... అనతికాలంలోనే లక్షా 26 వేల 728 ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసి చూపించి తాను ప్రజల మనిషి అని మరోసారి చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 వేల 158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా 110 మున్సిపాలిటీల్లో 3,809 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో పనిచేయడానికి 95 వేల 88 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, 33వేల 581 మంది వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.

ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అంతేగాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అదే విధంగా పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. 

ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మునిసిపాలిటీల్లో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, పశుపోషణ, విద్యుత్తు, వ్యవసాయం, సాంఘిస సంక్షేమం వంటి పలు విభాగాలకు చెందిన సేవలను వీరు ప్రజలకు అందించనున్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల సహాయంతో ఈ గ్రామ సచివాలయాల ద్వారా 500 పబ్లిక్ సేవలను అందించనున్నారు. దీనికోసం ఇప్పటికే తమ ప్రభుత్వం 2.8 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.

ప్రభుత్వ సేవలను అందించడంలో అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంత భారీ స్థాయి ఉద్యోగాలకు అవకాశం ఇచ్చామని, కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైవారు దీన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా ప్రజలకు సర్వీసుగా భావించాలని సీఎం చెప్పారు. ఈ వ్యవస్థకు విశ్వసనీయత తీసుకురావడం కోసం క్రమానుగతంగా సామాజిక గణనను నిర్వహిస్తామని దీనిద్వారా ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ లభిస్తుందని పేర్కొన్నారు. 

ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందకుండా ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 31 దాకా ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహిస్తామని, వివిధప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలను వీటిద్వారా భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వోద్యోగాల మేళాలో 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డ్ సెక్రటేరియట్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఉనికిలోకి రానున్నాయి. 

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు, తమ్ముళ్లకు అందరికీ సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ రికార్డు.

దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నా. ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం కూడా ఇచ్చాము. ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు’ అని పేర్కొన్నారు.

 ‘అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడొద్దు. మీ పని తీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశంలో ఇటువంటి ప్రయోగం ఎవరూ చేసి ఉండరు... మీరంతా కలిసి దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. 

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వాధికారులు సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle