newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఒకే ఒక్కడుతో పవన్‌కు ఇబ్బందులు తప్పవా?

18-07-201918-07-2019 07:51:33 IST
Updated On 18-07-2019 11:19:05 ISTUpdated On 18-07-20192019-07-18T02:21:33.612Z18-07-2019 2019-07-18T02:21:26.052Z - 2019-07-18T05:49:05.448Z - 18-07-2019

ఒకే ఒక్కడుతో పవన్‌కు ఇబ్బందులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే చిక్కులు వ‌చ్చి ప‌డేలా ఉన్నాయి. పార్టీ స్టాండ్ ఒక‌టైతే ఎమ్మెల్యే దారి మ‌రొక‌టిలా ప‌రిస్థితి మారింది. అధికారాన్ని ద‌క్కించుకుంటామ‌ని ఎన్నిక‌ల బ‌రిలో దిగిన జ‌న‌సేన పార్టీ ఒకే స్థానానికి ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.

పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. అయినా, తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

మొద‌టి రోజు జ‌న‌సేన కండువాతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయ‌న తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన‌లో ఉంటే త‌న నెంబ‌ర్ 1 అని, అదే వైసీపీలోకి వెళితే త‌న నెంబ‌ర్ 152 అని ఆయ‌న చెప్పారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్ట‌క‌పోయినా ఆయ‌న గొంతుక‌ను వ‌ర‌ప్ర‌సాద్ అసెంబ్లీలో వినిపిస్తార‌ని జ‌న‌సైనికులు అంతా భావించారు.

అయితే, ఆయ‌న మాత్రం సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌ను కొనియాడారు. అప్ప‌టికే జ‌న‌సైనికులు ఎమ్మెల్యే తీరుతో నొచ్చుకున్నారు. త‌మ ఎమ్మెల్యే జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నించారు.

ఇక‌, తాజాగా అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా వ‌ర‌ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను, వైఎస్సార్ పై ఆయ‌న పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. పేద‌లు, రైతుల కోసం వైఎస్సార్ ఎంతో చేశార‌ని, ఆయ‌న బాట‌లోనే జ‌గ‌న్ వెళుతున్నార‌ని చెప్పారు.

మ‌త్య్స‌కారులు జ‌గ‌న్‌ను దైవంలా భావిస్తున్నార‌ని కితాబిచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నారు. బ‌డ్జెట్ అమ‌లులోనూ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, జ‌గ‌న్ ఎప్ప‌టికీ ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

వైసీపీ ఎమ్మెల్యేల‌తో పోటీప‌డి మ‌రీ, ఆ మాట‌కొస్తే వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ‌గానే జ‌గ‌న్‌ను వ‌ర‌ప్ర‌సాద్ ప్ర‌శంసించారు. ఆయ‌న మాట్లాడుతున్నంత సేపూ వైసీపీ ఎమ్మెల్యేలు బ‌ల్ల‌లు చ‌రిచి అభినంద‌న‌లు తెలిపారు.

ఇది జ‌న‌సేన పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది. బ‌డ్జెట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించ‌క‌పోయినా ఆ పార్టీ త‌ర‌పున గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మానిట‌రింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ చింత‌ల పార్థ‌సారథి స్పందించారు.

బ‌డ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి మ‌ధ్య స‌మ‌తుల్య‌త లేద‌ని ఆరోపించారు. నిధుల కేటాయింపు స‌రిగ్గా లేద‌ని, రాష్ట్ర ప్ర‌గ‌తిని ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. కానీ, వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం.. బ‌డ్జెట్‌లో అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమానికి స‌మ‌ప్రాధాన్య‌త ఇచ్చార‌ని పేర్కొన్నారు.

ఇలా పార్టీ వైఖ‌రి ఒక‌లా ఉంటే ఎమ్మెల్యే వైఖ‌రి మ‌రోలా ఉంది. దీనిని జ‌న‌సేన  శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌ర్థిగా భావిస్తారు.

చంద్ర‌బాబు ప‌ట్ల ఆయ‌న‌కు కొంత సాఫ్ట్ కార్న‌ర్ ఉన్నా జ‌గ‌న్ అంటే మాత్రం చాలా ఆగ్ర‌హం. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న ఈ విష‌యం బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన తానా స‌భ‌లోనూ అవ‌స‌రం లేక‌పోయినా జ‌గ‌న్‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు.

ప‌వ‌న్ ను జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఫాలో అవుతూ వైసీపీనే ప్ర‌ధాన శ‌త్రువుగా భావిస్తుంటాయి. కానీ, వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం అధినేత ఆలోచ‌న‌ను తెలిసో, తెలియ‌క‌నో జ‌గ‌న్‌ను పొగుడుతున్నారు.

కాగా, గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన వ‌ర‌ప్ర‌సాద్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అభిమాని. ఆ అభిమానాన్నే ఇప్పుడు చాటుకుంటూ స్వంత పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నట్లు క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle