newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఒకవైపే చూడు...పవన్‌కు చింతమనేని వార్నింగ్

27-09-201827-09-2018 05:30:00 IST
Updated On 24-10-2018 16:35:58 ISTUpdated On 24-10-20182018-09-27T00:00:00.000Z27-09-2018 2018-09-27T00:00:00.000Z - 2018-10-24T11:05:58.105Z - 24-10-2018

ఒకవైపే చూడు...పవన్‌కు చింతమనేని వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్వంత జిల్లా పశ్చిమగోదావరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు. చింతమనేని ప్రభాకర్ రాజ్యాంగేతర శక్తిగా తయారవుతున్నారని, ఆయనపై పలు కేసులు ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని, లేకపోతే ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి పై చేయి చేసుకున్న సందర్భంలోనూ, గన్నవరంలో ఆర్టీసీ బస్సు‌పై చంద్రబాబు ఫోటో లేదని డ్రైవర్‌పై దాడి చేసిన సందర్భంలోనూ, మరికొన్ని ఇతర సందర్భాలలో కూడా చింతమనేని ఇలాగే వివాదాలతో వార్తల్లో నిలిచారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా దెందులూరులో పర్యటించినప్పుడు చింతమనేని వైఖరిపై గట్టిగా మాట్లాడకుండానే, తూతూ మంత్రం విమర్శలతో ముందుకు సాగిపోయారు.ద‌ళిత తేజం అంటూ వారికి అండ‌గా ఉంటామ‌ని మాట్లాడుతుంటార‌నీ, కానీ టీడీపీ ఎమ్మెల్యే ప్రజ‌ల‌ను తిట్టీ కొట్టీ హింసించే ప‌రిస్థితి ఉంద‌న్నారు. కులాల పేరుతో విమ‌ర్శలు, ఇత‌ర పార్టీల నేత‌ల‌పై రాళ్ళు వేయించ‌డం చేస్తుంటార‌నీ..ప్రజాస్వామ్యం విలువలు అంటే ఇవేనా అని పవన్ మండిప‌డ్డారు. సీఎం చంద్రబాబునాయుడు త‌మ శాస‌నస‌భ్యుల‌ను క్రమ‌శిక్షణలో పెట్టుకోవాల‌న్నారు. లేదంటే ఆ బాధ్యతను ప్రజ‌లు తీసుకునే రోజులు వ‌స్తాయ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యేపై చ‌ర్యలు తీసుకుంటారా, లేదంటే ప్రజ‌లు తిర‌గ‌బ‌డితే చూస్తారా అంటూ ముఖ్యమంత్రిని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. 

 

పవన్‌పై చింతమనేని ఫైర్

 

తనను రాజ్యాంగేతర శక్తిగా పవన్ కళ్యాణ్ అభివర్ణించడాన్ని తప్పు పట్టిన చింతమనేని, దెందులూరులో తనపై పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పవన్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు చింతమనేని ప్రభాకర్. రాజ్యాంగేతర శక్తిగా మారారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చేస్తున్న ఆరోపణలపై చింతమనేని కౌంటర్ ఇచ్చారు. తను హత్యలు, కబ్జాలు, ఎవరి మానప్రాణాలకైనా భంగం కలిగించినట్టు తన దృష్టికి వస్తే త్రిసభ్య కమిటీ విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రిని కోరినట్టు చెప్పారు. కావాలంటే పవన్ తనకు నచ్చిన వారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి తనపై వస్తున్న ఆరోపణలు విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఎక్కడైనా ఎప్పుడైనా పవన్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు చింతమనేని. పవన్ ఒకవైపు వాదనలు విని ఆరోపణలు చేయడం సబబు కాదని.. రెండు పక్షాల వాదనలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్  చింతమనేని‌పై చేసిన వ్యాఖ్యలు, చింతమనేని కౌంటర్లతో పశ్చిమ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   9 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   9 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   10 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   11 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle