newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఐదేళ్ల క‌క్ష ఐదు నెలల్లోనే తీర్చేశారా..?

08-11-201908-11-2019 13:00:46 IST
2019-11-08T07:30:46.976Z08-11-2019 2019-11-08T07:04:15.732Z - - 20-11-2019

ఐదేళ్ల క‌క్ష ఐదు నెలల్లోనే తీర్చేశారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. జేసీ ఆర్థిక మూలాల‌పై వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లో జేసీ దివాక‌ర్ రెడ్డికి చెందిన 80 బ‌స్సులు సీజ్ అయ్యాయి. ఆయ‌న కుటుంబానికి త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు కేటాయించిన భూమిని కూడా ర‌ద్దు చేసే దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది.

వైఎస్ కుటుంబంతో జేసీ దివాక‌ర్ రెడ్డికి ముందు నుంచే పెద్ద‌గా స‌ఖ్య‌త లేదు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక జేసీ దివాక‌ర్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకోక‌పోవ‌డంతో ఈ దూరం మ‌రింత పెరిగింది.

2014 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నుంచి జేసీ కుటుంబం వైసీపీలో చేరాల‌ని చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లించ‌లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి దివాక‌ర్ రెడ్డి ఎంపీగా, ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

టీడీపీ అధికారంలోకి రావ‌డంతో జేసీ సోద‌రులు రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు జ‌గ‌న్‌పై చేయ‌ని విమ‌ర్శ‌లు లేవు. ప్ర‌భాక‌ర్ రెడ్డి అయితే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు సైతం చేశారు.

రాయ‌ల‌సీమ‌తో పాటు రెడ్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో ఎక్క‌డా తెలుగుదేశం పార్టీ స‌మావేశం జ‌రిగినా జేసీ దివాక‌ర్ రెడ్డి స్పెష‌ల్ ఎంట్రీ ఇచ్చే వారు. జ‌గ‌న్ క‌ల్తీరెడ్డి అని, ఆయ‌న‌ది ఫ్యాక్ష‌న్ స్వ‌భావ‌మని విమ‌ర్శించే వారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో ఉన్న జ‌గ‌న్‌ను స‌భ‌ల్లో ప‌దే ప‌దే వాడు, వీడు అని సంభోదించే వారు.

జేసీ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ఎప్పుడూ బ‌య‌ట‌కు స్పందించలేదు. అలాగ‌ని మ‌రిచిపోయే అంత‌టి చిన్న వ్యాఖ్య‌లు ఏమీ జేసీ సోద‌రులు చేయ‌లేదు. ఇక‌, మొన్న‌టి ఎన్నిక‌ల్లో జేసీ సోద‌రుల‌కు అన్నిర‌కాలుగా ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. ఇద్ద‌రు వార‌సుల‌ను గెలిపించుకోలేక‌పోయారు. ఐదేళ్లుగా తాము ఎన్నో తిట్లు తిట్టిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి కూర్చున్నారు.

త‌మ‌కు ఎదురు లేద‌నుకున్న తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం కూడా చేజారిపోయింది. ఇక్క‌డ జేసీ సోద‌రుల ప‌ట్టు క్ర‌మంగా త‌గ్గిపోతోంది. ఈ దిశ‌గానే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అవుతున్నారు. జేసీ అనుచ‌రులు సైతం వైసీపీలో చేరిపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో, జిల్లాలో జేసీ సోద‌రుల ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిపోతోంది.

ఇదే స‌మ‌యంలో బ‌స్సులు సీజ్ చేస్తుండ‌టంతో రోజుకో షాక్ త‌గులుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే జేసీ సోద‌రుల‌ది పెద్ద ట్రావెల్స్ సంస్థ‌. ఈ ఐదు నెల‌ల్లో వివిధ కార‌ణాల‌తో వీరికి చెందిన 80 బ‌స్సులు సీజ్ చేశారు.

దీంతో జ‌గ‌న్ త‌మ‌పై క‌క్ష‌క‌ట్టి ఇలా చేస్తున్నార‌ని జేసీ ఆరోపిస్తున్నారు. బ‌స్సులు స‌మ‌యానికి రాలేద‌ని సైతం సీజ్ చేశార‌ని వాపోతున్నారు. త‌మ‌ను పార్టీలోకి ర‌మ్మ‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని, రానందుకే ఇలా క‌క్ష సాధిస్తున్నార‌ని అంటున్నారు.

గ‌త ఐదేళ్లు జ‌గ‌న్‌పై చూపించిన దూకుడు తాలుకు ప్ర‌భావం ఈ ఐదు నెల‌ల్లోనే జేసీ సోద‌రులు ఎదుర్కుంటున్నారు. క‌క్ష‌సాధింపో, మ‌రే కార‌ణ‌మో కానీ జేసీ సోద‌రుల‌కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తోంది. అయితే, జైలుకైనా వెళ్తాను కానీ వైసీపీలోకి మాత్రం వెళ్ల‌న‌ని, కోర్టుల‌కు వెళ్లి కొట్లాడుతాన‌ని జేసీ చెబుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle