newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

‘‘ఐదునెలల్లోనే జగన్‌ది అరాచకపాలన’’

04-11-201904-11-2019 13:39:03 IST
Updated On 04-11-2019 15:54:57 ISTUpdated On 04-11-20192019-11-04T08:09:03.430Z04-11-2019 2019-11-04T08:09:00.905Z - 2019-11-04T10:24:57.426Z - 04-11-2019

‘‘ఐదునెలల్లోనే జగన్‌ది అరాచకపాలన’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో నెలకొన్న ఇసుక సంక్షోభం రాజకీయ దుమారం రేపుతోంది. ఇసుక దొరక్క, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం జనసేన అధినేత విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బెజవాడలో బీజేపీ ఉద్యమం చేస్తోంది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కై బిజెపి ఇసుక సత్యాగ్రహం ప్రారంభించింది.

దీంతో విజయవాడ ధర్నా చౌక్ కాషాయమయం అయింది. ధర్నా చౌక్ కి బీజేపీ నేతలు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఇసుక సత్యాగ్రహం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి,  మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కిలారు దిలీప్, షేక్ బాజీ, శ్రీనివాస రాజు,  సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉంది కదాని వైసీపీ నేతలు, గూండాలు చేస్తున్న దౌర్జన్యాలు మామూలుగా లేవని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుందని ఫిర్యాదుచేస్తే బాధితులపైన కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారని అన్నారు. ఐదు నెలల్లోనే అరాచక పాలన సాగుతుంటే.. నాలుగున్నరేళ్ళలో ఇంకెలా ఉంటుందోనని తలుచుకుంటే భయంగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఇసుకను చిన్న సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు బీజేపీ నేతలు. రోమ్ తగలబడితే ఫిడేల్ వాయించుకున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని కన్నా మండిపడ్డారు. 

వరదల వల్ల ఇసుక రాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను బయటకు తీయవచ్చన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు. వరదల వలన ఇసుక తీయలేకపోతున్నామని  ప్రభుత్వం చెప్తున్న సమాధానం సహేతుకంగా లేదన్నారు.

ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఇసుక పాలసీ కి కూడా ముహూర్తం పెట్టడం ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రధాన సమస్యలను వదిలి ప్రజాధనంతో పంచాయితీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఈ రంగుల గురించి ఎన్నికల సంఘం నిలదీస్తే ఏం బదులిస్తారని ఆయన ప్రశ్నించారు. 

ఇసుక దొరకపోవడంతో పనులు లేక, రోజు గడవక భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ విషయంలో  ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం బాధ్యతారాహిత్యం అన్నారు. మరోవైపు మీడియాపై జీవో ద్వారా ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. తన స్వంత మీడియాలో ఎన్ని నిజాలు రాస్తున్నారో చూసుకోవాలన్నారు కామినేని. సీఎం జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని ఇసుక కొరత, ఇతర ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. 

 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle