newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు హైకోర్ట్ షాక్

12-03-201912-03-2019 12:30:27 IST
Updated On 12-03-2019 12:52:33 ISTUpdated On 12-03-20192019-03-12T07:00:27.906Z12-03-2019 2019-03-12T06:50:49.881Z - 2019-03-12T07:22:33.430Z - 12-03-2019

ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు హైకోర్ట్ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..  తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

డేటా చోరి వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్‌ హైకోర్టు షాకివ్వడంతో ఆయన అనివార్య పరిస్థితుల్లో పోలీసుల ఎదుట హాజరుకావడం తప్పనిసరి అయింది. ఈ కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్‌ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్‌ ఏపీ సిట్‌ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

అశోక్‌ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్‌ ఉన్నట్లు సమాచారం. అశోక్‌ కూడా ఓటు కోట్లు కేసులో అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle