newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఐటి దాడుల కలకలం..!

08-12-201808-12-2018 18:23:19 IST
Updated On 09-12-2018 15:59:54 ISTUpdated On 09-12-20182018-12-08T12:53:19.363Z08-12-2018 2018-12-08T12:53:13.523Z - 2018-12-09T10:29:54.630Z - 09-12-2018

ఐటి దాడుల కలకలం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎక్కడ ఐటి దాడులు జరిగినా ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.  ఏ చిన్న ఆరోపణలు వచ్చినా, ఈడీ, ఐటీ అధికారులు ఏపీపై వాలిపోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మాగుంట కంపెనీలపై ఐటీ దాడులు నివ్వెరపరుస్తున్నాయి. సుజనా చౌదరి. సీఎం రమేష్..బీద మస్తాన్ రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. ఇప్పటికే టీడీపీలోని పలు కీలక నాయకులపై ఐటీ దాడులు నిర్వహించి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు చెన్నై లోని టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. టీ నగర్‌లోని కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సవేరా హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా అక్కడ భారీగా నగదు, బంగారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాడుల్లో ఐటీ అధికారులు ఆధారాలు లేని రూ. 55 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

మాగుంట సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మాగుంట కుటుంబానికి చెందిన బాలాజీ బిస్లరీ, బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎండ్రికా ఎంటర్‌ప్రైజెస్ కంపెనీల్లోనూ తనిఖీలు జరిపారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని అణిచివేసేందుకు ఐటీని ఉపయోగించుకుంటుందని  బీజేపీ‌పై మండిపడుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఐటీ దాడులతో తమను భయపెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐటీ దాడులను ఆపేందుకు సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా అవి ఆగడం లేదు. ఏపీని వదిలి తమిళనాడుపై ఫోకస్ పెట్టింది ఐటి. ఈమేరకు ఏపీకి చెందిన నేతల కంపెనీలున్న చెన్నైలో దాడులు చేస్తోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఆఖరికి సీబీఐ ఎంట్రీకి అడ్డుపెట్టినా కేంద్రంలో మార్పులేదంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి.. ఇప్పుడే ఏపీలో పాలనపై ఫోకస్ పెట్టిన చంద్రబాబుకి ఈ ఐటి దాడులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle