newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఐఏఎస్ శ్రీలక్ష్మి పడరానిపాట్లు.. తోడుగా విజయసాయి

29-11-201929-11-2019 13:28:08 IST
Updated On 29-11-2019 14:44:33 ISTUpdated On 29-11-20192019-11-29T07:58:08.984Z29-11-2019 2019-11-29T07:57:52.765Z - 2019-11-29T09:14:33.422Z - 29-11-2019

ఐఏఎస్ శ్రీలక్ష్మి పడరానిపాట్లు.. తోడుగా విజయసాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి మరకలు అంటిన ఐఏఎస్ అధికారులలో శ్రీలక్ష్మి ముందువరసలో ఉన్నారు. ఇప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పాల్పడిన అవినీతి, అక్రమసంపాదన కేసులలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సిబిఐ తన ఛార్జ్ షీట్లలో ఆరోపించింది. ఆ కేసులలో అప్పటి మంత్రులతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

కొన్నాళ్ల పాట్లు జైలు జీవితం కూడా గడిపిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ క్యాడర్ లోకి వెళ్లిపోయారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీకి వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని వినిపించింది. వీటికి తగ్గట్లే శ్రీలక్ష్మి తెలంగాణకు సంబంధించి విధులకు హాజరుకాకపోగా ఏపీ సీఎంఓలోకి తీసుకోవాలని కేంద్రం వద్ద ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రపోజల్ కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉంది.

జగన్ ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ నుంచి స్టీఫెన్ రవీంద్ర అనే మరో ఐపీఎస్ ను డిప్యూటేషన్ పై ఏపీకి తీసుకురావాలని జగన్ భావించారు. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం అలా పంపడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పేసింది. ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో మాత్రం కేంద్రప్రభుత్వం గత నాలుగు నెలలుగా పెండింగ్ లోనే ఉంచింది. దేనికోసం శ్రీలక్ష్మి పడరాని పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఆ మధ్య కొద్దిరోజులు ఢిల్లీలో ఉన్న శ్రీలక్ష్మి పలువురు కేంద్రమంత్రులతో సంప్రదింపులు జరిపారు. దీనికోసంగా ఢిల్లీలో ఏపీ వ్యవహారాలను అధికారికంగా చూస్తున్న విజయసాయి రెడ్డి శ్రీలక్ష్మి వ్యవహారంలో రాయబారం నడుపుతున్నారు. కానీ కేంద్రంలో మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి- శ్రీలక్ష్మి మరోసారి కేంద్ర పెద్దల వద్ద సంప్రదింపులు మొదలుపెట్టారు.

ప్రస్తుతం డీల్లీలోని ఏపీ భవన్ లో మకాంవేసిన శ్రీలక్ష్మిని విజయసాయి రెడ్డి వెంటపెట్టుకొని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ను పార్లమెంట్‌లో కలిసి క్యాడర్ మార్పుపై మరోసారి సంప్రదింపులు జరిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా మంత్రులు అందుబాటులో ఉండడంతో శ్రీలక్ష్మి క్యాడర్ మార్పుపై పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మరి కేంద్రం దీనిపై స్పష్టత ఇస్తుందో లేదో.. ఇస్తే ఎప్పటికి ఇస్తుందో కానీ ఈలోగా ఏపీ ఖజానాకు చిల్లుపడుతుంది. ఇంకా తెలంగాణ క్యాడర్లోనే ఉన్న శ్రీలక్ష్మి ప్రస్తుతం ఏపీ భవన్ లోనే మకాం వేసి ఉన్నారు. ఆమెకి సకల సౌకర్యాలను ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. నిబంధనల ప్రకారం ఇంకా తెలంగాణకే చెందిన డీల్లీలో పెట్టే ప్రతిరూపాయిని ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.

 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   11 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   14 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle