newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ఐఎఎస్‌ల ధిక్కార స్వరం

19-01-201919-01-2019 16:25:20 IST
Updated On 19-01-2019 16:25:10 ISTUpdated On 19-01-20192019-01-19T10:55:20.325Z19-01-2019 2019-01-19T10:44:33.783Z - 2019-01-19T10:55:10.646Z - 19-01-2019

ఐఎఎస్‌ల ధిక్కార స్వరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొంతమంది ఐఎఎస్‌ అధికారుల ఏమాత్రం సహకరించడంలేదని మంత్రులు, టీడీపీ నేతలువాపోతున్నారు. ఎక్కడచూసినా అధికారులు మంత్రులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రెండుమూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐఎఎస్‌‌లు..  చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. కీలక శాఖ మంత్రుల్ని సైతం అధికారులు లైట్ తీసుకుంటున్నారు.. ఐఎఎస్‌ల మొండివైఖరితో సచివాలయంలో ఎక్కడ ఫైళ్ళు అక్కడే పేరుకుపోతున్నాయి. సంక్షేమపథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 

ఏపీ సెక్రటేరియట్‌లో తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ బాగా మారిపోయిందంటున్నారు. కొంతమంది అధికారులు డోంట్‌కేర్ అంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికలకు రెండుమూడునెలల ముందునుంచే అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. 20 శాతం నుంచి 30 శాతం మంది ఐఎఎస్‌లు సహాయనిరాకరణకు దిగుతున్నారని సమాచారం. ఏపీ సెక్రటేరియట్‌లో పరిస్థితులను గమనిస్తే కీలకమయిన అధికారులు రెండుమూడు వర్గాలుగా విడిపోయారు. సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలను ఒకరకం శిక్షలుగా భావిస్తున్నారు కొందరు సీనియర్లు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే అధికారులే కీలకం. అయితే పథకాల అమలుపై వారు శ్రద్ధ కనబరచడం లేదు. ఈ ప్రభుత్వం రెండుమూడు నెలలే ఉంటుందని అధికారులు వ్యాఖ్యానించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే వత్తిడి చేస్తే పనులన్నీ పెండింగ్‌లో పెడతారని మంత్రులు, సీనియర్ నేతలే భయపడుతున్నారు. 

ఓ వర్గం ఐఎఎస్‌లు విపక్ష నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదంటున్నారు. అరడజను మంది మంత్రులకు అధికారులు, సెక్రటరీలు చుక్కలు చూపిస్తున్నారు. మరో అరడజను మంది మాత్రం ఏదో విధంగా సర్దుకుపోతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో కొంతమంది మంత్రులు మాట్లాడి చాలాకాలం అయింది. మంత్రులు-అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సీనియర్ అధికారి ప్రభుత్వంపై చేస్తున్న కామెంట్స్ సీఎం వరకూ చేరాయి. కానీ ఎలాంటి చర్యలు లేవు. మంత్రుల పేషీల్లో అధికారుల అవినీతి క్రమేపీ పెరిగిపోతోంది. సీనియర్ మంత్రులను అధికారులు ఏమాత్రం లెక్క చేయడంలేదు. రాయలసీమ ఫ్యాక్షన్‌నే తాము డీల్ చేశామని, అలాంటిది ఐఎఎస్ అధికారుల చేత పనిచేయించుకోలేక పోతున్నామని కీలక శాఖల మంత్రులు వాపోతున్నారు. 

2019 ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని ఐఎఎస్‌లు స్వయంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు కీలక సమాచారాన్ని విపక్ష నేతలకు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సెక్రటరీ స్థాయి అధికారి యాంటీ గవర్నమెంట్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. రిటైర్డ్ అధికారులతో కలిసి వారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒక పక్క సీఎం చంద్రబాబు కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటే.. అధికారుల సహాయ నిరాకరణ మంత్రులను టెన్షన్ పెడుతోంది. దీంతో కీలకమయిన జీవోల జారీ కూడా ఆలస్యం అవుతోంది. కొన్ని పథకాలకు నిధులు లేవంటూ కొందరు ఆర్థికపరిస్థితిని సాకుగా చూపుతున్నారు.

సీఎం కఠినంగా ఉండకపోవడం వల్లే తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మంత్రులు బాహాటంగా అంటున్నారు. సీఎం అధికారులతో ఎక్కువ సమయం గడుపుతున్నా.. ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది. అధికారులకు సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ఐఎఎస్‌లు పట్టించుకోవడం లేదని మంత్రులు వాపోతున్నారు. రియల్ టైం గవర్నెన్స్‌పై కూడా వారు అసహనంతో ఉన్నారు. శాస్త్రీయత లేని ఆర్టీజీఎస్ రిపోర్టుల ఆధారంగా తమ పనితీరుని అంచనా వేయడం ఏంటని అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల ముందు ఏపీలో ఐఎఎస్‌ల సహాయ నిరాకరణ ప్రభుత్వానికి, మంత్రులకు చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle