newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఐఎండీ కంటే బాబు ఆర్టీజీఎస్ బెస్ట్!

19-12-201819-12-2018 15:30:18 IST
2018-12-19T10:00:18.173Z19-12-2018 2018-12-19T10:00:15.840Z - - 29-05-2020

ఐఎండీ కంటే బాబు ఆర్టీజీఎస్ బెస్ట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్యాధునిక టెక్నాలజీని తనకంటే మెరుగ్గా ఎవరూ ఉపయోగించలేరని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటారు. అవే పలుకులు ఆయన నోటి నుంచి మళ్ళీ వెలువడ్డాయి. తుపానులు, వర్షాల సమాచారం ఇచ్చే భారత వాతావరణ శాఖ కంటే తన టెక్నాలజీయే గ్రేట్‌ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పెథాయ్ తుపాను సందర్భంగా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్).  1100 కాల్ సెంటర్ ద్వారా బాధితులకు అవసరమయిన సాయం చేయడం, సందేహాలను తీర్చడం సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చానని చంద్రబాబు చెప్పారు. తాను తెచ్చిన ఆర్టీజీఎస్ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పెథాయ్‌ తుపాను కాకినాడ – ఒంగోలు మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేయగా, తాను తెచ్చిన టెక్నాలజీ యానాం – తుని మధ్య అని చెప్పగలిగిందన్నారు. పెథాయ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. 

ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా ‘భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు. ఎన్ని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోనసీమలో 22 ఏళ్ల క్రితం వచ్చిన తుపాను మొదలుకొని లైలా, హుదూద్, ఇటీవల తిత్లీ వరకూ అన్ని భారీ తుపాన్లనూ సాంకేతిక పరిజ్ఞానంతో తాను ఎదుర్కొన్నానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో తుపాను వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. భారత వాతావరణ శాఖ వెదర్ రీసెర్చ్ ఫోర్ కాస్ట్ ( డబ్ల్యూఆర్ఎఫ్) ఉపయోగిస్తుంటే ఆర్టీజీఎస్ విభాగం అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్ (ఈఎండబ్ల్యూఎఫ్) ద్వారా సముద్రంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, తుపానులను ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నామన్నారు. షార్ సాయంతో ఆర్టీజీఎస్ మరింత సమర్థంగా పనిచేయనుందన్నారు. ఆర్టీజీఎస్‌లో వివిధ వాతావరణ విభాగాలకు చెందిన 30మంది నిపుణులు అందుబాటులో ఉన్నారన్నారు. తుపానుల గురించి తెలుసుకునేందుకు, సముద్ర తీరంలో తాజా వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. తుపానులకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచిందంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   6 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   6 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   10 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   13 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   14 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   15 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle