newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఏసీలు ముద్దు.. ఫ్యాన్‌లు వద్దే వద్దు!

16-03-201916-03-2019 08:05:13 IST
Updated On 16-03-2019 08:05:00 ISTUpdated On 16-03-20192019-03-16T02:35:13.943Z16-03-2019 2019-03-16T02:29:49.252Z - 2019-03-16T02:35:00.869Z - 16-03-2019

ఏసీలు ముద్దు.. ఫ్యాన్‌లు వద్దే వద్దు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవాళ్టి నుంచి ఏసీలు మాత్రమే ఉంటాయి. ఫ్యానులు ఉండవు. హోదాతో సంబంధం లేకుండా అందరు చిన్నచితకా అధికారులు చల్లగా ఏసీలో కూర్చుని ఉద్యోగం చేసుకోవచ్చు. ఇదేదో సీఎం చంద్రబాబు ఆఫీసర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడో కొత్త ఆలోచన వచ్చిందట.

ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని ఫ్యానులను తీసేయాలని జిల్లా అధికారులకు చెబుతున్నారట. తమ మాట వినకపోతే ఊరుకోమని వార్నింగ్ కూడా ఇస్తున్నారట.

ఇంతకీ వీళ్ల బాధ ఏంటంటే జగన్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాను అవ్వడమే. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే జనం, ఈ ఫ్యానులను చూసి వైసీపీకి ఓటేస్తారన్న భయం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు పట్టుకుందట. అంతేకాదు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఫ్యానులు లేకుండా చూడాలని అధికారులను కోరారట టీడీపీ నేతలు.

ఈ డిమాండ్ చేస్తోంది స్వయానా కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలే. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యానులు తీసేయమంటూ తహశీల్దార్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారట కుప్పం తెలుగు తమ్ముళ్లు.

ఇప్పుడు ఈ ఐడియాను ఫాలో అవ్వాలని చిత్తూరు, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు టీడీపీకి ఓటు వేయమంటూ సైకిళ్లు పంచుతున్న తెలుగు తమ్ముళ్లు, తమ ఆఫీసుల్లో ఫ్యానులు పీకేయమని చెప్పడం ఏంటో అర్థం కాక అధికారులు బిత్తర పోతున్నారట. అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటించాలా, ఉన్న ఫ్యానులు ఊడబీకి చెమటలు కక్కుంటూ పని చేయాలా అన్న మీమాంశలో పడ్డారు అధికారులు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle