newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఏపీ హైకోర్టులో కప్పు కాఫీ కూడా దొరకడంలేదా?!

25-10-201925-10-2019 12:22:56 IST
2019-10-25T06:52:56.201Z25-10-2019 2019-10-25T06:52:52.556Z - - 16-11-2019

ఏపీ హైకోర్టులో కప్పు కాఫీ కూడా దొరకడంలేదా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కప్పు కాఫీ కూడా దొరకడం లేదా? రాజధాని అమరావతిలో ప్రస్తుతం కనీస మౌలిక వసతుల మాటే లేదా? అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం కనీస వసతులను కూడా పట్టించుకోవడం లేదా? ప్రభుత్వం రాజధానిగా అమరావతిని లెక్కలోకి తీసుకోవడం మానేసిందా? అంటే అవుననే అనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో కనీసం అవసరాలు కూడా లేవని సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేసారంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టుబట్టి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హైకోర్టును ఏపీకి తరలించింది. ఉన్నఫలంగా హైకోర్టును అమరావతికి తరలించిన చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక హైకోర్టును గ్రాండ్ గానే నిర్మించి జడ్జీలకు తాత్కాలిక ఏర్పాట్లను కూడా అరేంజ్ చేసి అక్కడ నుండి ప్రతిష్టాత్మకంగా సేవలను ప్రారంభించారు. ఇక శాశ్వత హైకోర్టును కూడా ప్రపంచ స్థాయిలోనే నిర్మించేందుకు నిపుణుల నుండి ప్రతిపాదనలు సిద్ధం చేసి అక్కడ నిర్మాణాలను కూడా మొదలుపెట్టారు.

అక్కడ సీన్ కట్ చేస్తే.. రాష్ట్రంలో ఎన్నికలు.. వైసీపీ ఘనవిజయం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం. తమ ప్రాంతానికి తరలించాలని రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో హైకోర్టు కోసం సిగపట్లు పడుతుండగా తాజాగా హైకోర్టులో అమరావతి స్విస్‌ చాలెంజ్‌ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ జీకే విచారణ ప్రారంభించగా ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాల పాటు వాయిదా కోరారు. అభ్యర్ధన మేరకు కేసును వాయిదా వాయిదా వేసిన చీఫ్ జస్టిస్ హైకోర్టులో ఏర్పాట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టులో కనీస వసతులను కూడా ఏర్పాటు చేయడం లేదని, జడ్జీలకు క్వార్టర్లు ఏర్పాటు చేయలేదని, లాయర్లకు సౌకర్యాలు లేవని, హైకోర్టు పరిధిలో క్యాంటీన్ కూడా సరిగా నిర్వహించడం లేదని, కనీసం కప్పు కాఫీ కూడా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వసతులు కల్పిస్తుందా లేదా తమకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించడంతో కోర్టులో ఉన్నవారంతా షాక్ అయ్యారు.

మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జస్టిస్ జేకే మహేశ్వరి రాష్ట్ర హైకోర్టులో పరిస్థితిపై ఇప్పటికే పలుమార్పు రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదింపులు పంపించినా ఫలితం శూన్యమవడంతో ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఓ పక్క హైకోర్టు తరలించాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల లాయర్లు తీవ్రంగా ఆందోళనలు చేస్తుండగా ఈమధ్యనే ఆందోళనలు విరమించి పరిష్కార మార్గం చూడాలని చీఫ్ జస్టిస్ సూచించారు.

ఇక ఇప్పుడు హైకోర్టులో వసతులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం దీనిపై ఏం సమాధానం చెప్తుందో తేలాల్సి ఉండగా ఓ పక్క రాజధాని ఎక్కడ ఉంటుందో అన్న విషయం కూడా ఓ కమిటీ నెత్తిన పెట్టేసిన ప్రభుత్వం జస్టిస్ సూక్తులను పట్టించుకుంటుందా? అన్నది అర్ధం కాని విషయం. అయితే జస్టిస్ వ్యాఖ్యలతో రాజధాని అమరావతిలో ప్రస్తుతం సగటు ఉద్యోగి కూడా బ్రతకలేని పరిస్థితి దాపురించింది అన్నది అధికారికంగా వెల్లడైన విషయం!!

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle