newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఏపీ సీఎస్‌గా నీలం సహాని... పాతరోజులు గుర్తుచేసుకున్న సీఎస్

14-11-201914-11-2019 14:49:20 IST
Updated On 14-11-2019 15:24:22 ISTUpdated On 14-11-20192019-11-14T09:19:20.698Z14-11-2019 2019-11-14T09:18:58.481Z - 2019-11-14T09:54:22.351Z - 14-11-2019

ఏపీ సీఎస్‌గా నీలం సహాని... పాతరోజులు గుర్తుచేసుకున్న సీఎస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సహాని గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంఛార్జ్‌ సీఎస్‌‌గా ఉన్న నీరబ్‌కుమార్‌ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ మహిళా సీఎస్‌లుగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి తొలి మహిళా సియస్‌‌గా బాధ్యతలు తీసుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు నీలం సహాని. 

ఇంతకుముందు ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా పనిచేశారు. నీలం సహానికి ఏపీతో సుదీర్ఘ అనుభవం ఉంది. 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

తదుపరి కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత ఏపీఐడీసీ వీసీ అండ్‌ ఎండీగా ఉన్నారు. అనంతరం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఏపీలో సీఎస్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 

జూన్‌ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు కొత్త సీఎస్ కి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ సీఎస్ బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై ఏపీ హెచ్ ఆర్డీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle