newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఏపీ సీఎంఓలో మొదలైన మరో ముసలం

11-11-201911-11-2019 00:02:49 IST
2019-11-10T18:32:49.766Z11-11-2019 2019-11-10T18:32:43.228Z - - 16-11-2019

ఏపీ సీఎంఓలో మొదలైన మరో ముసలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎంఓలో మరో లొల్లి మొదలైనట్లుగా తెలుస్తుంది. సీఎంఓకు.. ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి వ్యక్తిగత అధికారులకి మధ్య తరచుగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయని ఈమధ్యనే బహిర్గతం కాగా ఇప్పుడు మరో వివాదం మొదలైనట్లుగా తెలుస్తుంది. మొన్నటి వివాదానికి సీఎంవో ముఖ్యకార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖకు కూడా ముఖ్యకార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కారణం కాగా ఈ వివాదానికి కూడా ఆయనే మూలంగా ప్రభుత్వం భావిస్తుంది.

సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ విచక్షణాధికారాలు చెలాయిస్తున్నారని సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు జారీచేస్తే.. తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి మరీ సిఎస్ ను అవమానకరంగా బదిలీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చేలా మరో కార్యానికి పూనుకున్నారట.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. ప్రతినెలా జీతాలకు, సంక్షేమ పథకాలకు అప్పులు చేసి నానా తిప్పలు పడీ చెల్లింపులు చేస్తుంది. ఈ ఆర్ధిక కష్టాల స్థితి ప్రభుత్వంలో ఉన్నవారికి.. సీఎంఓలో అధికారులకు ఇంకా బాగా తెలుసు. ప్రభుత్వ ఆర్ధిక లోటు కారణంగా ప్రభుత్వంలో పనిచేసే శాఖలతో పాటు సీఎంఓలో కొన్ని శాఖలలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల జీతాలను చెల్లించలేదు.

ఈ క్రమంలోనే ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెండు నెలల జీతం పెండింగ్ లో ఉంది. ఆ ఉద్యోగులు తరచుగా ప్రవీణ్ ప్రకాష్ వద్దకు వెళ్లి జీతాల గురించి సతాయిస్తున్నారట. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ప్రవీణ్ ప్రకాష్ ఆర్ధికశాఖకు ఓ లేఖ రాశారట. ఇకపై ప్రతినెలా మొదట తన శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను చెల్లించిన తర్వాతనే తనకు జీతాన్ని జమచేయాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రవీణ్ ప్రకాష్ లేఖపై అటు ప్రభుత్వం, ఆర్ధికశాఖ గుర్రుగా ఉన్నాయట. ప్రభుత్వం ఉన్న పరిస్థితి తెలిసినా అయన అలా స్పందించడం సమంజసంగా లేదని భావిస్తున్నారట. ఆర్థికశాఖ ప్రభుత్వంలోని శాశ్వత ఉద్యోగులకు జీతాల కోసమే నానాయాతన పడుతుంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతినెలా సరైన సమయంలో జీతాలు చెల్లించడమంటే ఎంతకష్టమో ఊహించే ఈ లేఖ రాశారా? అని ప్రశ్నిస్తున్నారట.

కేవలం ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న శాఖలు సాధారణపరిపాలన, సీఎంఓకు మాత్రమే అయితే ఎలాగోలా చెల్లిస్తామని.. ఇప్పుడు వారిని చూసి మిగతా శాఖల ఉన్నతాధికారులు కూడా ఒత్తిడి తెస్తున్నారని.. చెల్లింపులు ఎలా సాద్యమని ప్రశ్నిస్తున్నారట. ప్రభుత్వంలో దాదాపు అన్ని శాఖలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలకంగా ఉండగా అందరికీ ఈ జీతాల చెల్లింపులో జాప్యమే జరుగుతుంది.

ఇక అన్నిశాఖలలో ప్రధాన కార్యదర్శుల దగ్గర పనిచేసే వారిలో సగానికిపైనే ఈ ఉద్యోగులు ఉన్నారు. అందరికీ ప్రతినెలా మొదటి వారంలో అంటే జరగని పని అని ఆర్ధికశాఖ స్పష్టం చేసిందట. అవసరాన్నిబట్టి.. శాఖలను బట్టి.. నిధుల లభ్యతను బట్టి సర్దుబాట్లు మాత్రమే చేయగలమని.. ఎవరికి వారు తమ నిజాయతీలను నిరూపించుకోవడానికి తమని వాడుకోవడం మంచిపద్దతా అని ప్రశ్నిస్తున్నారట. మరి ఈ కొత్త వివాదం ఎటు దారితీస్తుందో చూడాల్సిఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle