newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఏపీ సీఎంఓలో మరో లొల్లి.. సీఎస్ బదిలీ తప్పదా?

05-01-202005-01-2020 15:27:15 IST
Updated On 06-01-2020 13:00:05 ISTUpdated On 06-01-20202020-01-05T09:57:15.081Z05-01-2020 2020-01-05T09:57:05.980Z - 2020-01-06T07:30:05.017Z - 06-01-2020

ఏపీ సీఎంఓలో మరో లొల్లి.. సీఎస్ బదిలీ తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం .. ప్రభుత్వ ఉన్నతాధికారులు. సీఎంఓ అధికారుల మధ్య గొడవలు ఇప్పుడు రాజధాని మొత్తానికి తెలిసిందే. ఈ గొడవలు జగన్ సర్కార్ కొలువుదీరినప్పుడే మొదలు కాగా ఆ మధ్య ఇది తారాస్థాయికి చేరి ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్న సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని అవమానకర రీతిలో సాగనంపాల్సి వచ్చింది. ఆ గొడవలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ సీఎస్ ను బదిలీ చేశారు.

నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు, అధికార వర్గానికి సిఎస్ చీఫ్. రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం అయన చెప్పినట్లే వినాలి. ఎన్నికల సమయంలో సీఎంకి అధికారాలు లేకుండా చేస్తే సిఎస్ పరిపాలన చేస్తారు. సీఎం తర్వాత అంతటి పవర్ ఆయనది కాగా.. అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అయన చెప్ప్పినట్లే వినాలి. కానీ ఏపీలో మాత్రం తీరు వేరుగా ఉందని తెలుస్తుంది.

ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ పై వివాదాం నడుస్తుండగానే ఏపీకి తీసుకొచ్చి సీఎం జగన్ సీఎంఓ ముఖ్య కార్యదర్శిని చేశారు. ఇక ఒకప్పుడు విశాఖ జిల్లాకి కలెక్టర్ గా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ కే ఇప్పుడు విశాఖకి రాజధాని తరలింపు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. అంతటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ అధికారులని కూడా చెలాయిస్తూ చెలరేగిపోతున్నారట.

ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఒక్క సంతకంతో ప్రవీణ్ ప్రకాష్ సాగనంపాక సీఎం జగన్ నీలం సహానీని తీసుకొచ్చి సీఎస్ ను చేశారు. అయితే ఇప్పుడు ఆమె అధికారం కూడా ప్రవీణ్ ప్రకాష్ చేస్తుండడంతో సహానీ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి అయిన ప్రవీణ్ ప్రకాష్ దృష్టికి సిఎస్ తీసుకెళ్లినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారట.

దీనిపై త్వరలోనే సీఎం వద్దకి పంచాయతీ వెళ్లనుందని.. సిఎస్ వైస్ జగన్ ను కలిసి ఫిర్యాదులు చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే సీఎంకి అత్యంత నమ్మకస్తుడిగా మారిన ప్రవీణ్ ప్రకాష్ పై సహానీ ఫిర్యాదులు చేసినా ఒరిగేదేమీ లేదని సర్వాధికారాలు ఆయనవేనని.. ఇంకా మితిమీరితే ఎల్వీలానే అవమానకరంగా బయటకి వెళ్లాల్సివస్తుందని సీఎంఓ అధికారుల మాట.

నీలం సహానీ త్వరలోనే రిటైర్ కానున్నారు కనుక ఉన్నన్ని రోజులు ఇలా ఉండిపోతే సీఎస్ గా రిటైర్ అవుతారని.. లేకపోతే ఎల్వీలనీ కంటికి కనిపించని పోస్టుకి వెళ్లిపోవాల్సి వస్తుందని కొందరు సీనియర్ అధికారులు జోకులేసుకుంటున్నారు. అయితే సిఎస్ ప్రవీణ్ ప్రకాష్ తీసుకొనే నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరుతో పాటు ఇష్టారీతిన తీసుకొచ్చే జీవోలతో ఇబ్బందులు వస్తున్నాయని సహానీ ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ వివాదానికి ముగింపు ఎక్కడ.. ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle