newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఏపీ సీఎంఓలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు?

04-11-201904-11-2019 14:40:01 IST
Updated On 04-11-2019 15:47:29 ISTUpdated On 04-11-20192019-11-04T09:10:01.434Z04-11-2019 2019-11-04T09:09:54.783Z - 2019-11-04T10:17:29.373Z - 04-11-2019

ఏపీ సీఎంఓలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేసి తమకి అనుకూల ఉద్యోగులను నియమించుకున్నారు. ఏ ప్రభుత్వమైనా చేసే పనే ఇది కనుక కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే వైసీపీ సర్కార్ మరో అడుగు ముందుకేసి అప్పటి వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, ఛానెల్ సాక్షి సంస్థలో పనిచేసే ఉద్యోగులను భారీ సంఖ్యలో సచివాలయంలో దించేసింది.

ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రులకు పీఆర్ఓలుగా.. సచివాలయంలో వివిధ శాఖలలో ఉద్యోగులుగా సాక్షి నుండి దిగుమతైన వారితో సచివాలయం కళకళలాడుతుండగా సచివాలయ శాశ్వత ఉద్యోగులకు ఇది గందరగోళంగా మారిందని రాజధాని పరిసరాలలోనే వినిపించింది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం విషయానికి వస్తే ఏకంగా ఉన్నతస్థాయి అధికారుల మధ్యనే ఆధిపత్య పోరు కొనసాగుతుందని.. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రికే తెలిసినా అన్నిటిని సలహాదారులతోనే సరిచేసుకోవాలని సూచించారని ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం.

ఎన్నికలకు ముందే కేంద్రం అండతో జగన్మోహన్ రెడ్డి సిఎస్ గా ఎల్వీ సుబ్రహమణ్యంను ఏపీకి రప్పించారు. అప్పుడు పేరుకే సీఎంగా చంద్రబాబు ఉన్నా ఎన్నికల కోడ్ వలన అధికారాలన్నీ సీఎస్ చేతిలో ఉండడంతో రుణమాఫీ లాంటి కొన్ని ముఖ్యమైన జీవోల జారీ తర్వాత కూడా నిధులను తొక్కిపట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏకంగా ఆ పథకాలకు చెల్లింపులను అటకెక్కించేశారు. ఆ సంగతి పక్కనపెడితే అప్పుడు వైసీపీకి అంత ఫెవర్ గా ఉన్న సుబ్రహమణ్యంను ఇప్పుడు అధికారికంగా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తుంది.

ఒక్కసారి కొద్ది రోజులు వెనక్కు వెళ్తే టీడీపీ ప్రభుత్వ సమయంలో ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ ఉండేవారు. టీటీడీ దేవస్థానం లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలో ఏపీ భవన్ లో జరిపిన కొన్ని కార్యక్రమాలలో అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలతో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఓ పోలీస్ అధికారితో విచారణ జరిపించారు. ఓ సాధారణ పోలీస్ అధికారితో తనపై విచారణ జరిపించారంటూ ఘాటుగా స్పందించిన ప్రవీణ్ ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు.

అయితే ఏమైందో ఏమో కానీ వారాల వ్యవధిలోనే ప్రవీణ్ ప్రకాష్ ఏపీ సీఎంఓలో ఉన్నతాధికారిగా నియమితులయ్యారు. ఏకంగా సీఎం జగన్‌ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ను నియమించడంతో పాటు అప్పటి వరకు సీఎస్ సుబ్రహమణ్యం దగ్గర ఉన్న అధికారులను కూడా ఆయనకి అప్పగించారు. ప్రవీణ్ కుమార్ రాకతో సిఎస్ అసంతృప్తితో అప్పుడే సీఎంఓలో ముసలం మొదలైందని వినిపించినా అప్పటికి సిఎస్ సర్దుకుపోయారు.

తాజాగా ఐదారురోజుల క్రితం ప్రభుత్వం ఓ క్యాబినెట్ మీటింగ్ జరిపింది. ప్రతి క్యాబినెట్ మాదిరే సిఎస్ అన్ని శాఖల నుండి, మంత్రులు, సీఎం సూచనలతో వివరాలను సేకరించి క్యాబినెట్ అజెండాను సిద్ధంచేసి ఇచ్చారు. కానీ క్యాబినెట్ లో తాను ఇచ్చిన అంశాలు కాకుండా కొత్త అంశాలు చర్చకు రావడంతో సీఎస్ ఖంగుతిన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ప్రవీణ్‌ ప్రకాష్‌ కేబినెట్‌ అజెండాలో కొత్త అంశాలను చేర్చారు. ఇది విధివిధానాలకు విరుద్ధమంటూ సిఎస్ షోకాజ్ నోటీసులు కూడా జారీచేశారట.

చీఫ్ సెక్రటరీ.. ప్రిన్సిపాల్ సెక్రటరీ మధ్య ఈ యుద్ధం నడుస్తున్నా.. పరిస్థితి షోకాజ్ నోటీసుల వరకు వెళ్లినా.. సిఎస్ ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకి వెళ్లి పంచాయతీ పెట్టాలనుకున్నా.. సీఎం మాత్రం తన ముఖ్య సలహాదారు అజేయ కల్లం వద్దకి వెళ్లి మాట్లాడమని సూచించారట. ఇది తనను మరింత అవమానించినట్లుగానే భావిస్తున్న సిఎస్ సుబ్రహమణ్యం షోకాజ్ నోటీసులకు వచ్చిన సమాధానంను బట్టి కార్యాచరణకు సిద్దమవుతున్నట్లుగా చెప్తున్నారు. మరి ఈ ముసలం ఎంతవరకు వెళ్తుందో మరి!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle