newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఏపీ సర్కార్ పై బీజేపీ దూకుడు వెనుక వ్యూహమిదేనా?

26-09-201926-09-2019 14:04:18 IST
Updated On 26-09-2019 14:13:41 ISTUpdated On 26-09-20192019-09-26T08:34:18.989Z26-09-2019 2019-09-26T08:34:16.206Z - 2019-09-26T08:43:41.061Z - 26-09-2019

ఏపీ సర్కార్ పై బీజేపీ దూకుడు వెనుక వ్యూహమిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రగులు కుంటోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలేమీ లేవు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడన్న విషయంలో స్పష్టత లేదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు స్తబ్దుగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార పార్టీ తెలుగుదేశంపై కేంద్రం, రాష్ట్రంలో విపక్షం ఎలా విమర్శలతో విరుచుకుపడుతున్నాయో...అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైకాపా నిర్ణయాలపై కేంద్రంలోని మోడీ సర్కార్, ఆ పార్టీ ఎంపీలు, విపక్ష తెలుగుదేశం అదే విధంగా విరుచుకుపడుతున్నాయి. విపక్షంగా తెలుగుదేశం విమర్శల సంగతి అలా ఉంచితే...బీజేపీ విమర్శల దూకుడు జోరందుకుంది. పీఏపీల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ విషయాలలో బీజేపీ విమర్శల జోరు పెంచింది.

కేంద్ర మంత్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేంద్రం తీరును తప్పుపడుతూ ఘాటు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ఈ వ్యవహారంపై తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖాస్త్రం సంధించారు. ఆయన  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్రానికి లేఖ రాయడం ఇది మూడో సారి. ఒక సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆ తరువాత నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసి ఒప్పందాల సమీక్ష తగదని పేర్కొన్న ఆయన ముచ్చటగా మూడో సారి ఒకింత ఘాటు లేఖే రాశారు. 

అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఊహలతో ఒప్పందాల సమీక్షకు పూనుకోవడం సరికాదని స్పష్టంగా చెప్పడమే కాకుండా...అసలు ఆ ఒప్పందాలలో అక్రమాలే లేవని ధృవపరిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్య దేశ వ్యాప్తంగా ఇటువంటి ఒప్పందాల విశ్వసనీయత దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.  కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు లేఖలు రాయడం అసాధారణం. అయితే కేంద్రం రాష్ట్రంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్న విషయాన్ని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక పోలవరం రివర్స్ టెండరింగ్ పై కూడా బీజేపీ గుర్రుగా ఉంది. పోలవరం కేంద్రం ప్రాజెక్టు కావడం, పోలవరం టెండర్లు, పనులన్నిటికీ కేంద్రం అంగీకకారం, ఆమోదం ఉన్న నేపథ్యంలో వాటిలో అవకతవకలు, అవినీతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా కేంద్రానికి రుచించడం లేదు. అలాగే రాష్ట్రానికి జీవధార వంటి పోవలరం ప్రాజెక్టు విషయంలో అనవసర వివాదాలు, ప్రజలలో ప్రాజెక్టు పురోగతిపై సందేహాలు రేకెత్తేలా రాష్ట్రం తీరు ఉన్నదని కేంద్రం భావిస్తున్నది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ప్రజలలో అనుమానాలు, అపోహలు కేంద్రంలోని బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉండడంతో జగన్ సర్కార్ వైఖరిపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. 

ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీఏపీల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ లపైనే కాకుండా కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం కూల్చివేత సహా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.  ఈ విమర్శల వెనుక రాష్ట్రంలో బలోపేతం కావాలన్న బీజేపీ వ్యూహం కూడా ఉందనడంలో సందేహం లేదు.  పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఉపయోగం లేకపోగా...వ్యయం భారీగా పెరగడమే కాకుండా ప్రాజెక్టు పనులలో తీవ్ర జాప్యం జరుగుతుందని జనం భావిస్తున్న నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు కేంద్రం మద్దతు లేదని చాటడం కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఆ కారణంగానే పోలవరం రివర్స్ టెండర్లు అవసరం లేదని గతంలోనే కేంద్ర మంత్రి విస్పష్టంగా ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలంటే కేంద్రం ఆ పని ఎప్పుడో చేసి ఉండేది.  కానీ జగన్ తీరు, పాలన మొత్తం కక్షసాధింపు ధోరణిలోనే ఉందన్న భావన ప్రజలలో బలంగా ఏర్పడాలన్న ఉద్దేశంతోనే...బీజేపీ విమర్శల దూకుడు పెంచుతోంది. రివర్స్ టెండర్ పేరుతో సింగిల్ టెండర్ విషయంలో ప్రజలలో ముప్పిరిగొన్న అనుమానాలు మరింత బలపడేలా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి మేఘా సంస్థ ‘రివర్స్’లో పోలవరం టెండర్ దక్కించుకోవడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న తెలుగుదేశం ఆరోపణలను బలపరిచే విధంగానే సుజనా విమర్శలు ఉన్నాయి. 

పోలవరం పనుల విషయంలో గత ప్రభుత్వంలో ఉన్న పారదర్శకత జగన్ సర్కార్ లో కనిపించడం లేదని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ పోలవరం విషయంలో తెర వెనుక మంత్రాంగం ఏదో నడుపుతున్నదన్న సంకేతం ఇవ్వడమే లక్ష్యంగా భావించాల్సి ఉంటుంది. సింగిల్ టెండర్ ఖారారులో మతలబు ఏమిటన్న చర్చ రాష్ట్రంలో జరిగేందుకు సుజన విమర్శలు దోహదపడ్డాయి.  రాష్ట్రంలో జగన్ సర్కార్ పై బీజేపీ విమర్శల జోరు పెంచడం వెనుక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునే వ్యూహం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. .


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle